రాజ్యసభ ఛైర్మన్ కుర్చీలో పీటీ ఉష రాజ్యసభలో గురువారం అరుదైన ఘటన జరిగింది. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్ అటెండ్ కాకపోవడంతో పీటీ ఉష రాజ్యసభకు అధ్యక్షత వహించారు. ఛైర్మన్ ఛైర్ లో కూర్చొని రాజ్యసభ సమావేశాలను నడిపించారు. దీనికి సంబంధించిన వీడియోను పీటీ ఉష తన ట్వట్టర్లో పోస్ట్ చేశారు.
‘ఫ్రాంక్లిన్ డి. రూజ్‌వెల్ట్ చెప్పినట్లుగా గొప్ప స్థానం గొప్ప బాధ్యతను కలిగి ఉంటుంది. నేను రాజ్యసభ సెషన్‌కు అధ్యక్షత వహించినప్పుడు నాకు కూడా అలాగే అనిపించింది. ప్రజలు నాపై ఉంచిన నమ్మకంతో ఈ జర్నీలో మరో మైలురాయి సాధిస్తా’ అని ఉష తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
రాజ్యసభ ఛైర్మన్ లేదా డిప్యూటీ ఛైర్మన్ అందుబాటులో లేనప్పుడు సభ కార్యకలాపాలను నిర్వహించే రాజ్యసభ వైస్ చైర్‌పర్సన్‌ల ప్యానెల్‌లోని నామినేటెడ్ సభ్యుల్లో ఒకరు అధ్యక్షత బాధ్యతలు చూస్తారు. గతేడాది రాజ్యసభకు నామినేట్ అయిన పీటీ ఉష ఈ కమిటీలో మెంబర్ గా ఉన్నారు.
©️ VIL Media Pvt Ltd.