రెండో సెషన్ లో కుప్పకూలిన ఆసీస్.. తిప్పేసిన జడేజా.. కష్టాల్లో కంగారూలు

IND vs AUS 1st Test : ఆస్ట్రేలియా (Australia)తో జరుగుతున్న బోర్డర్ గావస్కర్ ట్రోఫీ (Border Gavaskar Trophy 2023) 2023 తొలి టెస్టులో టీమిండియా (Team India) ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాను స్పిన్ తో తప్పిసేంది. ఒక దశలో లంచ్ సమయానికి ఆస్ట్రేలియా 32 ఓవర్లలో 2 వికెట్లకు 76 పరుగులతో పటిష్టంగానే కనిపించింది. అయితే రెండో సెషన్ లో మాత్రం రవీంద్ర జడేజా (Ravindra Jadeja) దెబ్బకు ఆస్ట్రేలియా బ్యాటింగ్ కుప్పకూలింది. రెండో సెషన్ లో జడేజా 4 వికెట్లతో రెచ్చిపోయాడు. మరో రెండు వికెట్లను అశ్విన్ సొంతం చేసుకున్నాడు. దాంతో టీ విరామం సమయానికి ఆస్ట్రేలియా 60 ఓవర్లలో 8 వికెట్లకు 178 పరుగులు చేసింది. ప్రస్తుతం హ్యాండ్స్ కాంబ్ (69 బంతుల్లో 29 బ్యాటింగ్; 4 ఫోర్లు), నాథన్ లయన్ (3 బంతుల్లో 0 బ్యాటింగ్)లు క్రీజులో ఉన్నారు.

76/2 దగ్గర నుంచి రెండో సెషన్ ను ఆరంభించిన ఆస్ట్రేలియా ఆరంభంలో మెరుగ్గానే ఆడింది. లబుషేన్ (49) అర్ధ సెంచరీ చేసేలా కనిపించాడు. అయితే స్పిన్ ను బాగా ఆడుతున్నా అనే అత్మవిశ్వాసం కాస్తా.. అతి విశ్వాసంగా అతడికి మారింది. దాంతో జడేజా బౌలింగ్ లో ముందుకు వచ్చి ఆడే ప్రయత్నం చేసి స్టంపౌట్ అయ్యాడు. ఇక్కడి నుంచి ఆస్ట్రేలియా పతనం మొదలైంది. ఆ తర్వాతి బంతికే రేన్ షా (0) ఎల్బీగా అవుటయ్యాడు. మరికాసేపటికే స్టీవ్ స్మిత్ (37) జడేజా బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే ఇక్కడి నుంచి కాసేపు క్యారీ (36), హ్యాండ్స్ కాబ్ లు జట్టును ముందుకు నడిపారు. ముఖ్యంగా క్యారీ రివర్స్ స్వీప్ షాట్లతో వేగంగా పరుగులు సాధించాడు. పలు బౌండరీలను కూడా సాధించాడు. అయితే అశ్విన్ బౌలింగ్ లో రివర్స్ స్వీప్ కు వెళ్లి వికెట్ల మీదకు ఆడుకున్నాడు. కెప్టెన్ కమిన్స్ (6), అరంగేట్రం హీరో మర్పీ (0) వెంట వెంటనే అవుటయ్యారు. దాంతో టీ విరామ సమయానికి ఆస్ట్రేలియా పీకల్లోతు కష్టాల్లో పడింది.

పిచ్ ఎలా ఉందంటే?

నాగ్ పూర్ పిచ్ పక్కా స్పిన్ ట్రాక్ లా ఉందని పిచ్ రిపోర్ట్ సమయంలో సంజయ్ మంజ్రేకర్, మ్యాథ్యూ హెడెన్ లు పేర్కొన్నారు. రెడ్ సాయిల్ కావడంతో టర్న్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా లెఫ్టాండ్ బ్యాటర్లకు ఈ మ్యాచ్ పీడకల లాంటిదని మంజ్రేకర్ పిచ్ రిపోర్ట్ సమయంలో తెలిపాడు. ఆస్ట్రేలియా తరఫున వార్నర్, ఖాజా, క్యారీ లకు అగ్ని పరీక్షలా ఉండే అవకాశం ఉంది.

తుది జట్లు

ఆస్ట్రేలియా

ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), ఉస్మాన్ ఖాజా, డేవిడ్ వార్నర్,  లబుషేన్, స్మిత్, పీటర్ హ్యాండ్స్ కాబ్, అలెక్స్ క్యారీ, మ్యాట్, మర్ఫీ, లయన్, స్కాట్ బొలాండ్

టీమిండియా

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యదవ్, జడేజా, భరత్, అశ్విన్, అక్షర్ పటేల్, షమీ, సిరాజ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *