రేవంత్‌ను ఫాలో అవుతానంతోన్న కోమటిరెడ్డి.. ‘బైక్ యాత్ర’కు సిద్ధం.. ఎప్పటినుంచంటే?

తెలుగురాష్ట్రాల్లో పాదయాత్రల సీజన్ నడుస్తోంది. అటు ఆంధ్రప్రదేశ్‌లో యువగళం పేరుతో టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్ర చేస్తుంటే.. తెలంగాణలో బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అయితే.. ఇప్పటికే ఐదు విడతల్లో ప్రజా సంగ్రామ యాత్ర ముగించుకోగా.. ప్రజా ప్రస్థానం పేరుతో వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల చాలా రోజులుగా నడక సాగిస్తున్నారు. కాగా… ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ కూడా పాదయాత్ర చేపట్టింది. హాత్ సే హాత్ జోడో పేరుతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. ఇప్పటికే తన నడక మొదలుపెట్టేశారు. ఆయనొక్కడే కాకుండా.. ఆయా నియోజకవర్గాల్లోని ప్రజాప్రతినిధులు కూడా ఈ హాత్ సే హాత్ జోడో యాత్రలో అడుగులు వేయనున్నారు. ఈ నేపథ్యంలోనే నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. తన పాదయాత్ర గురించి స్పందించారు. నడిస్తే టైం సరిపోదని.. అన్ని గ్రామాలను టచ్ చేయలేమని తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

అయితే.. హాత్ సే హాత్ జోడో యాత్రలో తాను కూడా భాగస్వామ్యమవుతానని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం లోక్‌సభ సమావేశాలు జరుగుతున్నందున.. ఈ నెల 13 నుంచి హాత్ సే హాత్ జోడో యాత్రలో పాల్గొననున్నట్టు స్పష్టం చేశారు. పాదయాత్ర చేయటం వల్ల అన్ని గ్రామాలను టచ్ చేయలేమన్న కోమటిరెడ్డి.. బైక్ యాత్ర చేస్తానని పేర్కొన్నారు. నల్గొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం, రంగారెడ్డి.. నాలుగు జిల్లాలను కలుపుకుని బస్సు యాత్ర లేదా బైక్ యాత్ర చేస్తానని తెలిపారు.

ఎన్నికలకు సమయం తక్కువగా ఉన్నందు వల్ల 12 నియోజకవర్గాల్లో పూర్తిస్థాయిలో బైక్ యాత్ర చేస్తానన్నారు. మొదట ఈనెల 13న నల్గొండలో బైక్ యాత్ర చేస్తానన్న కోమటిరెడ్డి.. మిగతా నియోజకవర్గాల్లో బైక్ యాత్ర చెయ్యాలా.. బస్సు యాత్ర చెయ్యాలా అన్నది ఆలోచిస్తానన్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి కూడా నడుస్తున్నారని.. అయితే గ్రామాలు లేని చోట కార్లలో వెళ్తున్నారని కోమటిరెడ్డి తెలిపారు. తాను కూడా వీలును బట్టి అలాగే చేస్తానంటూ తెలిపారు. మొత్తానికి ఈ విషయంలో రేవంత్‌రెడ్డిని ఫాలో అవుతానంటున్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

97742810

Read More Telangana News And Telugu News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *