వివాహానికి వెళ్తుండగా బస్సు, ట్రాక్టర్ ఢీ

వివాహానికి వెళ్తుండగా బస్సు, ట్రాక్టర్ ఢీ జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మాల్యాల మండలం తక్కల్లపళ్లి గ్రామం  మ్యాడంపల్లి టర్నింగ్ వద్ద ఓ ప్రైవేట్ బస్సు, ట్రాక్టర్ ఢీ కొన్నాయి.  ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. బస్సులో పెగడ పల్లి మండలం బతికపల్లి గ్రామంలోని ఓ వివాహానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *