సింగ‌ర్ య‌శ‌స్వి మోసం.. సెల‌బ్ర‌టీ హోదా కోసం త‌ప్పు చేశారా?

Singer Yasaswi: సింగ‌ర్ య‌శ‌స్వి.. టాలీవుడ్‌లో మంచి పేరున్న యువ సింగ‌ర్‌. తెలుగు సంగీత ప్ర‌పంచంలో త‌న‌దైన గుర్తింపును సంపాదించుకున్న ఈయ‌న ఒకే పాట‌తో రాత్రికి రాత్రే ఫేమ‌స్ అయిపోయిన సంగ‌తి. అదే ‘జాను’ సినిమాలోని (Jaanu movie) ‘లైఫ్ ఆఫ్ రామ్’ (Life of Ram). సరిగమప పాటల పోటీలో యశస్వి పాట పాడిన తీరుకి తెలుగు ప్రేక్ష‌కులు ఫిదా అయిపోయారు. ఏకంగా స‌రిగ‌మ‌ప పోటీల్లోనూ విజేత‌గా నిలిచాడు. సెల‌బ్రిటీగా మారిపోయాడు య‌శ‌స్వి. అయితే ఇప్పుడు ఈయ‌న వివాదంలో చిక్కుకున్నారు. త‌ను చేయ‌ని ప‌నికి త‌నే క్రెడిట్ సంపాదించుకున్నార‌ని ఈయ‌న‌పై ఫ‌రా కౌస‌ర్ అనే స్వ‌చ్చంద సంస్థ నిర్వాహ‌కురాలు ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. అస‌లు విష‌య‌మేమంటే..

ఫ‌రా కౌస‌ర్ (Farah Kausar) అనే మ‌హిళ న‌వ సేన‌ పేరుతో స్వ‌చ్చంద సంస్థ‌ను నిర్వ‌హిస్తుంది. ఆమె సింగ‌ర్‌ య‌శ‌స్వి సెల‌బ్రిటీహోదాతో చీటింగ్ చేస్తున్నార‌ని ఆరోప‌ణ‌లు చేస్తుంది. ఇటీవ‌ల ఓ షోలో పాల్గొన్న య‌శ‌స్వి న‌వ సేవ ఫౌండేష‌న్ పేరుతో తానొక ఫౌండేష‌న్ న‌డుపుతున్నాన‌ని, దాని ద్వారా 50-60 మంది పిల్ల‌ల‌ను చ‌దివిస్తున్నాన‌ని ఆయ‌న తెలిపారు. అయితే ఆయ‌న చెప్పిన మాటల్లో నిజం లేద‌ని ఆ ఫౌండేష‌న్‌ను తాను నిర్వ‌హిస్తున్నాన‌ని ఫ‌రా కౌస‌ర్ తెలిపారు.

‘‘సింగర్ యశస్వి చెప్పేవన్నీ అబద్దాలు. నేను నవ సేన‌ ఫౌండేషన్‌ను స్థాపించి ఐదేళ్లుగా 56 మంది అనాథ‌ పిల్ల‌ల‌కు అండ‌గా నిల‌బ‌డుతున్నాను. వారిన చ‌దివిస్తున్నాను. య‌శ‌స్వి మాకు సాయం చేసిందేమీ లేదు. సింగింగ్ షోలో ఓట్లు రాబ‌ట్టుకోవ‌టం కోసం న‌వ సేవ‌ను తానే అంతా తానై న‌డిపిస్తున్న‌ట్లు చెప్పారు. కానీ అందులో నిజం లేదు. ఈ విష‌యంపై నేను అత‌న్ని స్వ‌యంగా క‌లిసి వివ‌ర‌ణ అడిగాను. అత‌నేం ప‌ట్టించుకోలేదు. చానెల్‌లో వేసిన వీడియోను నా అనుమ‌తి లేకుండానే మా ఫౌండేష‌న్‌లో చిత్రీక‌రించారు. ఇంత వ‌ర‌కు ఆయ‌న మా ఫౌండేష‌న్‌కు రానే లేదు. కొంద‌రు ఈ విష‌యం య‌శ‌స్విగారికి తెలియ‌కుండానే ఇది జ‌రిగింద‌ని అంటున్నారు. డిసెంబ‌ర్ 31న టీవీలో దీనికి సంబంధించిన కార్య‌క్ర‌మం వ‌స్తే.. ఇన్ని రోజులు మ‌రి ఆయ‌న ఏం చేస్తున్నారు. య‌శ‌స్వి మంచి పేరున్న సింగ‌ర్‌, రోల్ మోడ‌ల్‌. దానికి త‌గ్గట్లు ప్ర‌వ‌ర్తిస్తే బావుండేది. ఇప్పుడు ఆయ‌న ఏం చెబుతారో చూడాల‌ని వెయిట్ చేస్తున్నాను’’ అన్నారు ఫరా కౌసర్.

మరిప్పుడు తన పేరుతో జరుగుతున్న వివాదంపై సింగర్ యశస్వి (Singer Yasawi Controversy)ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.

Read

Tollywood Updates

and

Telugu News

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *