స్కేటింగ్ లో వీరి విన్యాసాలు చూస్తే వావ్ అనాల్సిందే!

E.Santosh, News18, Peddapalli

కాళ్లకు రోలర్స్ కట్టుకొని గ్రౌండ్లో దిగారంటే కళ్ళు మూసి తెరిచేలోపు అలా రౌండ్ వేసేస్తున్నారు. తమ విన్యాసాలతో చూసేవారిని కట్టిపడేస్తారు. శరీరాన్ని విల్లులా వంచుతూచేసే విన్యాసాలు చూస్తే వావ్ అనాల్సిందే. స్కేటింగ్లో ఇప్పటికే జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పతకాలు సొంతం చేసుకొని.. జాతీయస్థాయిలోనూ ప్రతిభచూపేందుకు ఈ పిల్లలు స్కేటింగ్ లో చేసే విన్యాసాలు అన్నీ ఇన్నీ కాదు. పెద్దపల్లి జిల్లా (Peddapalli District) గోదావరిఖనిలో కాకతీయ జూనియర్ కాలేజీలోతరుణ ఇన్టిట్యూట్ ఆధ్వర్యంలో పిల్లలకి స్కేటింగ్ నేర్పిస్తున్నారు. ప్రస్తుతానికి తరుణ్ ఇన్స్టిట్యూట్ లో 35 మంది స్కేటింగ్ విద్యార్థులు ఉన్నారు. వారికి ప్రతి రోజూ సాయంత్రం 5.30 నుండి 7 గంటల వరకు కోచింగ్ ఇస్తున్నాడు. ట్రైనింగ్ లో 4 సంవత్సరాల పిల్లల నుండి నేర్చుకుంటున్నారు.

పెద్దపల్లిలో చిన్నారులు స్కేటింగ్ పట్ల ఆసక్తి చూపుతున్నా.. జిల్లాలోస్కేటింగ్ కి ఎక్కువగా గుర్తింపు లేకపోవడంతో స్కేటింగ్ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం అవుతుంది. ఇలా కావడానికి కేవలం సరైన రింక్ లేకపోవడం అని మాస్టర్ తరుణ తెలిపాడు. మొదట్లో స్కేటింగ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభంలో స్కేటింగ్ ఇక్కడ ఎవరూ నేర్చుకుంటారులే అనుకున్నామని.. మొదట ఐదు మందితో ప్రారంభమై ఇప్పుడు 38 మంది పిల్లలు నేర్చుకుంటున్నారు. సరైన రింక్ ను ఏర్పాటు చేస్తే మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అధికారుల చుట్టూ, స్థానికంగా ఉన్న నాయకుల చుట్టూ తిరిగినా లాభం లేకపోయిందని అన్నారు. స్కేటింగ్ కోసం ఒక రింక్ ఏర్పాటు చేయాలని తరుణ్ కోరుతున్నారు.

ఇది చదవండి: రోడ్డుపక్కనే ట్రైన్.. అక్కడికి వెళ్తే అన్నీ ఘుమఘుమలే..!

గురువు ప్రోత్సాహం..

స్కేటింగ్‌ అకాడమీలో గురువు తరుణ్ అద్భుతంగా నేర్పిస్తున్నారని పిల్లల తల్లిదండ్రులు అంటున్నారు. ఏడాదిపాటు ఆయన శిక్షణలో నేర్చుకున్నా.. ఆయన గేమ్‌ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు.ఎన్నో అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించారు. టోర్నమెంట్‌కు ఎలా సన్నద్ధం కావాలో సూచనలిస్తుంటారు. ఇలాంటి గురువులు మాకు లభించడం నిజంగా అదృష్టం అని ఓ చిన్నారి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *