Reverse Mortgage: సమాజం చాలా మంది సరైన ఆదాయం లేని వారు కనిపిస్తుంటారు. ముఖ్యంగా వారసులు లేని వృద్ధులు, సంపాదించే సత్తా లేని వారు తారసపడుతుంటారు. అలాంటి వారికి వృద్ధాప్యంలో జీవనం చాలా కష్టంగా మారుంది. ఇలాంటి వారు వృద్ధాప్యంలో ఉండి సరైన ఆదాయ వనరులు లేని వారికి రివర్స్ మార్టగేజ్ లోన్ ఒక మంచి ఆదాయ మార్గంగా చెప్పుకోవచ్చు. తమ వద్ద స్థిరంగా ఉన్న సొంత ఇంటిని తనఖా పెట్టి నెల నెలా కొంత ఆదాయాన్ని బ్యాంకుల నుంచి పొందవచ్చు. పైగా దీన్ని తమ జీవికాలంలో తప్పక చెల్లించాలనే నిబంధన కూడా ఉండకపోవడం ఆలోచించాల్సిన అంశం.
చాలా మందికి మార్టగేజ్ లోను గురించి తెలిసే ఉంటుంది. మనకు సంబంధించిన ఇంటిని బ్యాంకులు కుదవపెట్టి లోన్ తీసుకుంటారు. ఆ రుణాలను ప్రతి నెల ఈఎంఐల రూపంలో చెల్లిస్తుంటారు. అయితే, రివర్స్ మార్టగేజ్ అనేది ఒకటి ఉందని చాలా మందికి తెలియదు. వృద్ధాప్యంలో సంపాదించేలక సతమతమవుతున్న వారికి ఇది ఎంతగానే ఉపయోగపడుతుంది. ఈ రివర్స్ మార్టగేజ్ పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
97769554
రివర్స్ మార్టగేజ్ వివరాలు..
60 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్స్ తమ సొంతింటిని బ్యాంకులో తనగా పెట్టి క్రమం తప్పకుండా ఆదాయం పొందవచ్చు. పైగా ఇల్లు వారి పెరిటే ఉంటుంది కూడా.
లోన్ తీసుకున్న వారు జీవించి ఉన్నంత వరకు బ్యాంకులు దీనిపై అసలు, వడ్డీ కూడా అడగవు.
నేషనల్ హౌసింగ్ బ్యాంకు వద్ద నమోదైన ప్రాథమిక లెండింగ్ సంస్థలు, షెడ్యూల్డ్ బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు రివర్స్ మార్టగేజ్ రుణాలను అందిస్తాయి.
లోన్ తీసుకునే వారి ఇంటి విలువ, వయసుపై రుణ మంజూరు ఆధారపడి ఉంటుంది.
రుణ మొత్తాన్ని నెల వారిగా, మూడు, ఆరు నెలలు లేదా ఒకేసారి ఏక మొత్తంలో తీసుకోవచ్చు.
గరిష్ఠ లోన్ వ్యవధి 20 ఏళ్లు ఉంటుంది. అంటే లోన్ తీసుకున్న సమయం నుంచి వరుసగా 20 ఏళ్ల పాటు మంజూరైన మొత్తాన్ని వాయిదాలుగా పొందొచ్చు.
రివర్స్ మార్టగేజ్ ద్వారా లోన్ తీసుకున్న వారు జీవించి ఉన్నంత కాలం లేదా వేరే ఇంటికి శాశ్వతంగా మారనంత వరకు తనఖా పెట్టిన ఇంటిని ఉపయోగించుకోవచ్చు.
లోన్ తీసుకున్న వారు మరణించినా లేక అక్కడి నుంచి ఇతర ప్రాంతానికి వెల్లినా.. ఆ ఇంటిని అమ్మి బ్యాంకు రుణాన్ని వడ్డీతో సహా వసూలు చేసుకుంటుంది.
అలా అమ్మిన డబ్బులో ఇంకా ఏమైనా మిగిలి ఉంటే చట్టపరమైన వారసులకు ఇచ్చేస్తుంది.
97771904