50 పైసల షేరు.. 2 నెలల్లో లక్షను రూ.8.40 లక్షలు చేసిన స్టాక్.. మీ దగ్గరుంటే?

Multibagger Stocks: మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుంటారా? ఎలాంటి స్టాక్స్‌ను మీరు ఎంచుకుంటుంటారు. సరైన స్టాక్స్‌తోనే అదిరిపోయే లాభాలు పొందొచ్చు. ఇంకా ఆర్థిక నిపుణుల సలహా తీసుకుంటే.. అదిరిపోయే లాభాలను పొందొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం కాస్త ఒడుదొడుకుల్లో ఉన్నాయి. అయినప్పటికీ కొన్ని స్టాక్స్ లాభాలను అందిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా పెన్నీ స్టాక్స్ ఊరిస్తూ.. ఇన్వెస్ట్ చేసేలా చేస్తుంటాయి. కానీ ఇవి కొంచెం రిస్కే. అయినప్పటికీ.. ఇవి దీర్ఘకాలంలో మంచి లాభాలను అందించే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు.

అలా ఇన్వెస్టర్లకు రెండే రెండు నెలల్లో మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చిన ఒక పెన్నీ స్టాక్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. అదే జై మాతా గ్లాస్ లిమిటెడ్ (Jai Mata Glass Limited). ఇప్పటికీ ఈ స్టాక్‌ మంచి బుల్లిష్ జోన్‌లో ఉంది. కొనుగోళ్లు వెల్లువెత్తుతున్నాయి. గురువారం సెషన్‌లో ఈ స్టాక్ షేరు ధర 5 శాతం అప్పర్‌సర్క్యూట్ కొట్టి.. రూ. 4.02 కు చేరింది. గత కొన్ని రోజులుగా ఈ స్టాక్ అప్పర్‌సర్క్యూట్ కొడుతూనే ఉండటం గమనార్హం. ఇక రెండు నెలల్లో చూసుకుంటే గనుక ఏకంగా 740 శాతం రిటర్న్స్ అందించింది.

97715088

ఒక్క నెలలో 180 శాతం లాభాన్ని అందించింది జై మాతా గ్లాస్ లిమిటెడ్ స్టాక్. ఈ సమయంలో రూ.1.44 నుంచి రూ. 4.02కు చేరింది. 2022, డిసెంబర్ 5న ఈ స్టాక్ ధర కేవలం 50 పైసల వద్ద మాత్రమే ఉండేది. ఇక ఈ రెండు నెలల సమయంలో 740 శాతం పెరిగింది. ఈ లెక్కన 2 నెలల కిందట ఇందులో రూ.లక్ష ఇన్వెస్ట్ చేస్తే గనుక అది నేడు రూ.8.40 లక్షలయ్యేది.

97760146

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *