టీడీపీ యువ నాయకుడు నారాలోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చిత్తూరు జిల్లా సంసిరెడ్డిపల్లెలో నారా లోకేష్ ను అక్కడి పోలీసులు అడ్డుకున్నారు. అంతేకాదు నారా లోకేష్ మాట్లాడకుండా మైక్ ను లాక్కోగా..లోకేష్ నిలబడ్డ స్టూల్ ను సైతం లాక్కునేందుకు పోలీసులు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, టీడీపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే నారా లోకేష్ స్టూల్ పై నిలబడి నిరసన తెలిపాడు. చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని..రాజ్యాంగం ఇచ్చిన హక్కును హరించడానికి మీరెవరంటూ పోలీసులను నిలదీశారు. మా గ్రామం వచ్చినప్పుడు మాట్లాడొద్దని అనడానికి పోలీసులకు ఏం హక్కు ఉందని లోకేష్ పోలీసులను ప్రశ్నించారు.
Ap: నారా లోకేష్ పాదయాత్రలో ఉద్రిక్తత
