Bandla Ganesh on Pawan: పవన్ విషయంలో మాట మార్చిన బండ్ల గణేష్..అవమానపరిచినా ఆభరణంగా ఫీలవ్వాలి అంటూ !

Bandla Ganesh Comments on Pawan Kalyan Goes Viral: ఈ మధ్య కాలంలో బండ్ల గణేష్ చేస్తున్న దాదాపు అన్ని ట్వీట్లు చర్చనీయాంశంగా మారుతున్నాయి. గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనకు దేవుడి లాంటి వాడు అంటూ పవన్ కళ్యాణ్ భజన చేస్తూ ఉండే బండ్ల గణేష్ ఈ మధ్యకాలంలో ఆయన సినిమా ఇవ్వడం లేదనో మరో కారణం చేతనో అప్పుడప్పుడు తన అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నాడు. అయితే కొద్ది రోజుల క్రితం రవితేజ ఫోటో షేర్ చేసి కళ్ళల్లో కసి, మీసంలో పౌరుషం, ముక్కు మీద రాజసం అంటూ ఒక క్యాప్షన్ పెట్టడంతో ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఏందన్నా బండ్ల అన్న బండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి దారి నుంచి మారి మాస్ మహారాజా రవితేజ గారి రోడ్డులోకి వెళ్ళింది, దేవరను మరిచావా? భక్తి తగ్గిందా? అని ప్రశ్నించారు.

దానికి బండ్ల గణేష్ నేను హిందువుని శ్రీశైలం వెళ్తాను, తిరుపతి వెళ్తాను, శబరిమల వెళ్తాను అంతేకానీ తనకు ఇతర దేవుళ్ళు తెలియదు అన్నట్టుగా కామెంట్ చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ కు బండ్ల గణేష్ కు మధ్య చెడిందని అందుకే బండ్ల గణేష్ ఈ విధంగా కామెంట్ చేశాడు అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఒక ప్రముఖ మీడియా ఛానల్ అయితే ఏకంగా పవన్ కు బండ్ల గణేష్ వార్నింగ్ ఇచ్చాడు చిచ్చు అంటుకుందా అని కూడా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడం చర్చనీయాంశం అయింది. దీనికి కారణం బండ్ల గణేష్ చేసిన మరో ట్వీట్ అన్ స్టాపబుల్ కార్యక్రమంలో గబ్బర్ సింగ్ సినిమాకి బండ్ల గణేష్ పూర్తి రెమ్యూనరేషన్ ఇచ్చాడా అని అడిగితే అతను అనుకున్నంత ఇచ్చాడని పవన్ కళ్యాణ్ పేర్కొన్నాడు.

ఇదే విషయం మీద పెద్ద ఎత్తున చర్చ జరగగా ఒక నెటిజన్ బండ్ల గణేష్ అన్న ఇప్పుడు అర్థమైందా? రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళకి మనం కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి, నువ్వు పవన్ కళ్యాణ్ ని ఎంత అభిమానించావో తెలుగు వారందరికీ తెలుసు, కానీ ఒక పాపులర్ షో అని కూడా చూడకుండా అలా మాట్లాడాడు అంటే ఆయన నీకు ఇచ్చే రెస్పెక్ట్ ఏంటో తెలుస్తుంది నిన్ను చూస్తే బాధగా ఉందని సదరు నెటిజన్ కామెంట్ చేయడంతో నా విశ్వరూపం కూడా చూపిస్తానని బండ్ల పేర్కొన్నాడు.

ఇదే విషయం మీద పెద్ద ఎత్తున చర్చ జరగగా తాజాగా ఒక నెటిజన్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఏంటి గణేష్ అన్న మీరు పవన్ కళ్యాణ్ కి వార్నింగ్ ఇచ్చారా? అంటే ఈ జన్మకు లేదు పవన్ కళ్యాణ్ నాకు దైవ సమానులు అని మరోసారి మాట మార్చాడు బండ్ల. ఇక ఆ తర్వాత వేదాంతం చెబుతూ మరోసారి చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. జీవితం ప్రశాంతంగా ముందుకు సాగాలంటే చాలా సందర్భాల్లో అన్నీ అర్థమైనా అర్థం కానట్టు నటించాలి, ఒక్కసారి ఎన్నో తెలిసినా ఏమీ తెలియనట్లు ఉండాలి, ఒక్కోసారి అవతలివారు చెప్పేది అబద్ధం అని తెలిసినా అవాక్కవ్వకుండా ఉండాలి, ఒక్కోసారి మనల్ని అవమానపరిచినా ఆభరణంగా ఫీలవ్వాలి అంటూ బండ్ల రాసుకొచ్చాడు. 

Also Read: Bandla Ganesh Praises Ravi Teja : పవన్ కళ్యాణ్‌ను పక్కన పెట్టేశాడా?.. రవితేజను ఆకాశానికెత్తేస్తోన్న బండ్ల గణేష్‌

Also Read: Shraddha Murder Case: బ్లో టార్చ్ తో ముఖం కాల్చేసి, ఎముకలను గ్రైండర్లో వేసి దారుణం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ –  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ –  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *