DAO ఎగ్జామ్ డేట్మార్చాలని బీజేవైఎం వినతి పత్రం డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (DAO) ఎగ్జామ్ డేట్ మార్చాలంటూ బీజేవైఎం నాయకులు టీఎస్పీఎస్సీ ఛైర్మన్ కు వినతి పత్రం ఇచ్చారు. అదే రోజున స్టాఫ్ సెలక్షన్ కమిషన్, కేంద్రీయ విద్యాలయ్ సంఘటన్, ఎయిర్ పోర్ట్ నియామక పరీక్షల ఉన్నందున డీఏఓ ఎగ్జామ్ డేట్ మార్చాలని కోరారు. ఒకే రోజున పరీక్షలు ఉన్నందున రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగులు పరీక్ష రాసే అవకాశం కోల్పోతారని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ అన్నారు. అందుకే ఎగ్జామ్ డేట్ మార్చాలని టీఎస్‌పీఎస్సీ చైర్మన్ కు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ఒకవేళ పరీక్ష తేదీ మార్చకపోతే టీఎస్పీఎస్సీ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు.
©️ VIL Media Pvt Ltd.