Dhanush Sir Trailer Talk: ధనుశ్ ’సార్’ మూవీ ట్రైలర్ టాక్.. ఎలా ఉందంటే..

Dhanush Sir Trailer Talk : తమిళ స్టార్ హీరో.. జాతీయ ఉత్తమ నటుడు ధ‌నుష్ విషయానికి వస్తే.. ఆయన విభిన్నమైన, విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఇతను వెంకీ అట్లూరి దర్శకత్వంలో బై లింగ్వల్ మూవీ చేస్తున్నారు. తమిళంలో ‘వాతి’ టైటిల్‌తో వస్తుంటే.. తెలుగులో ‘సార్’ పేరుతో విడుదల అవుతోంది.ముఖ్యంగా ఆయన సామాన్యుల జీవితాలను తెరపై చర్చిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. ఈయన కేవలం తమిళంకే పరిమితం కాకుండా.. హిందీలో పలు చిత్రాల్లో నటించారు. ఇపుడు తెలుగు ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో డైరెక్ట్‌గా ఓ తెలుగు చిత్రంలో నటిస్తోన్న ధనుశ్.. దాంతో పాటు వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘సార్’ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ధనుశ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. మన దేశంల ో చదువు అనేది నాన్ ప్రాఫిటబుల్ సర్వీస్. త్రిపాఠి ఇన్‌స్టూట్యూషనల్ తరుపున మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ కాలేజీలను దత్తత తీసుకుందాం అని చెబుతారు. ఇక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలంటే కాసులు ఖర్చు పెట్టాలి. డబ్బులున్న వాడు ఈ లెక్కన కొంటాడు. తక్కువ ఉన్నవాడు అప్పు చేసైనా కొంటాడు. మొత్తంగా మన తెలుగు రాష్ట్రాలు సహా దేశ వ్యాప్తంగా విద్యను వ్యాపారంగా మలిచిన కొంత కార్పోరేట్లకు ఒక సామాన్య గురువుకు మధ్య జరిగిన పోరాటంగా ఈ సినిమాను తెరకెక్కించారు. మొత్తంగా ప్రస్తుతం విద్య అనేది డబ్బున్న వాడికి సొంతం అనే రీతిలో ఉంది. దాన్ని ఒక సామాన్యుడైన ఒక కాలేజీ సార్ ఎలా ఎదుర్కొని పోరాడి నిలుచుడానదే ‘సార్’ మూవీ స్టోరీ.

గురు బ్రహ్మ.. గురు విష్ణు.. గురు దేవో మహేశ్వర: అనే ఆర్యోక్తి  అనుసరించి గురువును మనం త్రిమూర్తులతో సమానంగా పోలుస్తాము. అలాగే మాతృదేవోభవా, పితృదేవోభవ తర్వతా ఆచార్య దేవోభవా అంటూ తల్లి, తండ్రిల తర్వాత గురువులకు మన పురాణాలు పేర్కొంటాయి. అలాంటి గురువులు ఇపుడు కార్పోరేట్ మాయలో పడి నలిగిపోతున్నారు. ముఖ్యంగా ‘సార్’ సినిమాలో జీరో ఫీజ్.. జీరో ఎడ్యుకేషన్.. మోర్ ఫీజ్.. మోర్ ఎడ్యుకేషన్ ప్రస్తుతం మన సమాజంలో నడుస్తోన్న ట్రెండ్‌ను ఈ సినిమాలో చక్కగా ఆవిష్కరించారు.

ప్రస్తుతం దేశంలో నడుస్తోన్న విద్యా వ్యవస్థను ప్రశ్నించేలా ఈ సినిమాను రూపొందించారు. మన దగ్గరున్న బెస్ట్ లెక్చరర్‌ను గవర్నమెంట్ కాలేజీకి పంపిస్తే.. ఎలా అంటూ కార్పోరేట్ కాలేజీలో ఎలా వెనకుండి నడిపిస్తాయో ‘సార్’ మూవీలో చూపించారు. 90వ దశకంలో దేశంలో సరళీకృత ఆర్ధిక విధానాల కారణంగా విద్యా వ్యవస్థలో ప్రైవేటు గుత్తాధిపత్యం పెరిగిపోయింది. అక్కడ ఉన్న కార్పోరేట్ విద్యా సంస్థలు ఎలా స్కూల్లతో పాటు టీజర్లను శాసిస్తున్నాయో ఈ సినిమాలో చూపించనున్నాడు. ఈ కార్పోరేట్ విద్యా సంస్థలపై తిరగబడ్డ ఓ సామాన్య ఆచార్యుడు ఎలాంటి అనుభవాలను ఫేస్ చేసాడనేది ఈ సినిమా స్టోరీ.

ముఖ్యంగా విద్య అనేది దేవుడి గుడిలో పెట్టే నైవేద్యం లాంటిది అది అందరికీ పంచండి. ఫైవ్ స్టార్‌ హోటలో డిష్‌లాగా అమ్మకండి అని ధనుశ్ చెప్పే డైలాగులు బాగున్నాయి. తెలుగులో తొలి డైరెక్ట్ మూవీ అయినా.. తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నాడు. ధనుశ్ బాలగంగధర్ తిలక్ అనే లెక్చరర్ పాత్రలో అద్భుతంగా నటించారు. చివరగా మన రెండో రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గెటప్‌లో ధనుశ్ లుక్ బాగుంది. మొత్తంగా ప్రస్తుతం సమాజంలో చదువు పేరిట జరగుతున్న దోపిడిని కళ్లకు కట్టినట్టు చూపించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *