Hyundai Alcazar SUV: సూపర్ 7 సీట్ కారు వచ్చేసింది.. బేస్ వేరియంట్‌లో కూడా 6 ఎయిర్‌ బ్యాగ్‌లు! ధర సైతం తక్కువే

6 Airbags in Hyundai Alcazar 7 Seater Car: భారతదేశంలో ఏడు సీట్ల కార్లకు డిమాండ్ రోజురోజుకు భారీగా పెరుగుతోంది. కుటుంబసభ్యులతో బయటికి వెళ్లేందుకు 7 సీట్ కారును చాలా మంది ప్రిఫర్ చేస్తారు. అందుకే మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga) ప్రస్తుతం నంబర్ వన్ 7 సీట్ల వాహనంగా ఉంది. కియా మోటార్స్ కూడా గత సంవత్సరం కియా కేరెన్స్ ఎంపీవీ (Kia Carens MPV)ని విడుదల చేసి.. ఈ విభాగంలోకి దూసుకెళుతోంది. ఈ కారుకి వినియోగదారుల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది.

హ్యుందాయ్ కంపెనీ కూడా సెవెన్ సీటర్ కారును కలిగి ఉందని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. విశేషమేమిటంటే.. దీని బేస్ వేరియంట్‌లో కూడా 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయి. ఇది ఎంజీ హెక్టర్ ప్లస్ (MG Hector Plus), టాటా సఫారి (Tata Safari) మరియు మహీంద్రా ఎక్స్‌యూవీ 700 (Mahindra XUV 700) వంటి కార్లతో పోటీపడుతుంది.

ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న వాహనం మరేదో కాదు.. హ్యుందాయ్ అల్కాజర్ (Hyundai Alcazar). భారతదేశంలో ఈ కారు ధర రూ. 16.10 లక్షల నుంచి మొదలై.. రూ. 21.10 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఇది హ్యుందాయ్ కంపెనీ నుంచి వచ్చిన మూడో ఎస్‌యూవీ. ఈ కారు మొత్తం 8 ట్రిమ్‌లలో వస్తుంది. 6 మరియు 7 సీట్ల లే అవుట్‌లో ఈ కారుని కొనుగోలు చేయవచ్చు.

అల్కాజర్ కారు రెండు ఇంజన్ ఆప్షన్లను కలిగి ఉంటుంది. ఒకటి 2-లీటర్ పెట్రోల్ (159PS/191Nm) కాగా.. మరొకటి 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ (115PS/250Nm). ఇందులో 6-స్పీడ్ మ్యాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలు ఉన్నాయి. ఇది మూడు డ్రైవ్ మోడ్‌లను (ఎకో, సిటీ మరియు స్పోర్ట్) కలిగి ఉంటుంది.

అల్కాజర్ కారు 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్, ఆటో క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. భద్రత కోసం.. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్-స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్‌లను స్టాండర్డ్‌గా ఉంటాయి.

Also Read: Rishabh Pant Accident: రిషబ్ పంత్‌ను గట్టిగా పీకాలనుంది.. కపిల్‌ దేవ్‌ ఆగ్రహం!

Also Read: WTC 2023 Final Date: డబ్ల్యూటీసీ ఫైనల్‌ డేట్ వచ్చేసింది.. స్పిన్నర్ల చేతిలోనే భారత్ భవితవ్యం!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ –  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ –  https://apple.co/3loQYe 

Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *