భారత్‌తో నాగ్‌పూర్ వేదికగా గురువారం జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 2008 తర్వాత ఆస్ట్రేలియా టీమ్ నాగ్‌పూర్‌లో మళ్లీ టెస్టు మ్యాచ్‌లు ఆడుతుండగా.. 2004 నుంచి భారత్ గడ్డపై ఆస్ట్రేలియా టీమ్ టెస్టు సిరీస్ గెలిచింది లేదు. ఈ సిరీస్‌లో మొత్తం నాలుగు టెస్టులు జరగనుండగా.. నాగ్‌పూర్ పిచ్ స్పిన్‌కి సహకరించే సూచనలు కనిపిస్తున్నాయి. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షి (2021-2023) ఫైనల్‌కి చేరాలంటే ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియాని భారత్ జట్టు తప్పక ఓడించాల్సి ఉంది.
IND vs AUS: నాగ్‌పూర్ టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. గిల్‌పై వేటు తెలుగు క్రికెటర్‌కి ఛాన్స్
