IND vs AUS : ముగిసిన తొలిరోజు ఆట బోర్డర్ గవాస్కర్ ట్రోఫిలో భాగంగా నాగ్పూర్ వేదికగా జరుగుతోన్న ఫస్ట్ టెస్టు మొదటిరోజు ఆట ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా జట్టును టీమిండియా బౌలర్లు 177 పరుగులకే ఆలౌట్ చేశారు. జడేజా5 వికెట్లు తీసి ఆసీస్ బ్యాటర్లను కంగారెత్తించగా .. అశ్విన్ మూడు, సిరాజ్, షమి తలో వికెట్ పడగొట్టారు. ఆ తరువాత బ్యాటింగ్ స్టార్ట్ చేసిన టీమిండియా 24 ఓవర్లు ఆడి ఒక వికెట్ నష్టానికి 77 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (20) పరుగులు చేసి టాడ్ మార్ఫీ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (56), అశ్విన్(0) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. మొత్తానికి మొదటిరోజు ఆటలో టీమిండియాదే పైచేయిగా నిలిచింది.
అశ్విన్ టెస్టుల్లో ఆరుదైన ఘనత
ఈ మ్యాచ్ లో రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో ఆరుదైన ఘనత సాధించాడు. 450 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఆసీస్ ఆటగాడు అలెక్స్ క్యారీని ఔట్ చేసి అశ్విన్ ఆ ఘనతను సాధించాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 450 వికెట్లు సాధించిన మొదటి భారత బౌలర్‌గా నిలిచాడు. 88 టెస్టుల్లో అశ్విన్ ఈ ఘనతను సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు అనిల్ కుంబ్లే పేరిట ఉండేది. కుంబ్లే 93 టెస్టు మ్యాచ్ లో 450 వికెట్ల మార్క్ ను అందుకున్నాడు.
©️ VIL Media Pvt Ltd.