Mahashivratri 2023: 30 ఏళ్ల తర్వాత మహాశివరాత్రి అరుదైన యాదృచ్చికం.. ఈరాశులకు తిరుగులేనంత ధనం..

Mahashivratri Upay 2023:  పార్వతీపరమేశ్వరులు వివాహం మాఘమాసంలోని కృష్ణపక్ష చతుర్దశి నాడు జరుగుతుంది. ఈరోజునే మహాశివరాత్రి జరుపుకుంటారు. ఈ ఏడాది ఈ పండుగ ఫిబ్రవరి 18న వస్తుంది. ఈరోజున మహాదేవుడిని పూజిస్తే మీరు అన్ని సమస్యల నుండి బయటపడతారు. సంతానం లేని దంపతులకు పిల్లలు కలుగుతారు. అనారోగ్యం నుండి విముక్తి లభిస్తుంది.

30 ఏళ్ల తర్వాత మహాశివరాత్రి నాడు అరుదైన యాదృచ్చికం ఏర్పడుతుంది. ఆ విశేషం ఏమిటంటే తండ్రీకొడుకులైన సూర్యుడు మరియు శనిదేవుడు కుంభరాశిలో కలిసి ఉంటారు. వీరిద్దరూ అరుదైన దుగ్ధ సర్కార్ యోగాన్ని (Dugdha Sarkara Yoga) ఏర్పరుస్తుంది. ఇదే టైంలో ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు మీనరాశిలో కూర్చుని ఉంటాడు. ఇలాంటి సమయంలో మహాదేవుడిని పూజించడం వల్ల గ్రహాల కారణంగా వచ్చే బాధలన్నీ తొలగిపోతాయి. మీరు అన్ని దోషాల నుండి విముక్తి పొందుతారు. 

మహాశివరాత్రి నివారణలు

మహాదేవుని మహిమ అనన్యమైనది. మహాశివరాత్రి రోజున శివలింగానికి అభిషేకం చేస్తే మీరు పితృదోషం, గృహదోషంతోపాటు అన్ని దోషాలు తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ సమయంలో శివ పంచాక్షరీ మంత్రాన్ని 108సార్లు జపించడం వల్ల మీరు ప్రయోజనం పొందుతారు. 

మహాశివరాత్రి ఈరాశులకు శుభప్రదం

మేష రాశి – ఈ సంవత్సరం మహాశివరాత్రి నాడు శంకరుని విశేష ఆశీస్సులు మేష రాశి వారికి లభిస్తాయి. వ్యాపారులు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఉద్యోగస్తుల ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో కొనసాగుతున్న ఒత్తిడులు తొలగిపోతాయి. కుటుంబంలో ఆనందం మరియు శ్రేయస్సు ఉంటుంది.

వృషభం – ఈ రాశి వారు మహాశివరాత్రి నాడు శివుడికి పంచామృతంతో అభిషేకం చేయండి. దీని వల్ల అదృష్టం మీ వెంటే ఉంటుంది. పెట్టుబడి పెట్టడానికి ఇదే సరైన సమయం. సంపదలో పెరుగుదల ఉంటుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది.

కుంభం- కుంభరాశిలో శని ఉండటం వల్ల మహాశివరాత్రి రోజున ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీ జీవితంలో ప్రేమ పెరుగుతుంది, మీరు వివాహం చేసుకునే అవకాశం ఉంది. వివిధ రకాలుగా మీకు ధనం అందుతుంది.

Also Read: Guru Gochar 2023: త్వరలో మేషరాశిలో గురు గోచారం.. ఇక ఈరాశుల జేబులో పైసా కూడా మిగలదు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ –  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ –  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *