Moto e13: మోటోరోలా సంచలనం… రూ.6,999 ధరకే స్మార్ట్‌ఫోన్… 64GB స్టోరేజ్, 13MP కెమెరా

మోటోరోలా ఇండియా మరో సంచలనం సృష్టించింది తక్కువ ధరకే ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్ (Entry Level Smartphone) రిలీజ్ చేసింది. రూ.6,999 ధరకే మోటో ఇ13 (Moto e13) మొబైల్ లాంఛ్ చేసింది. ఇందులో యూనిసోక్ ప్రాసెసర్, 64GB స్టోరేజ్, 13MP కెమెరా, భారీ బ్యాటరీ లాంటి మరెన్నో ఫీచర్స్ ఉన్నాయి. ఇండియాలో రిలీజైన మోటో ఇ13 త్వరలోనే గ్లోబల్ మార్కెట్లలో లాంఛ్ కానుంది. మోటో ఇ13 రెండు వేరియంట్లలో రిలీజైంది. ప్రారంభ ధర రూ.6,999. ఇప్పటికే మార్కెట్లో రూ.10,000 లోపు ఉన్న స్మార్ట్‌ఫోన్లకు మోటో ఇ13 గట్టి పోటీ ఇవ్వనుంది. మోటో ఇ13 ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.

మోటో ఇ13 ధర

మోటో ఇ13 రెండు వేరియంట్లలో రిలీజైంది. 2జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.6,999 కాగా, 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,999. ఫిబ్రవరి 15 మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ప్రారంభం అవుతుంది. ఫ్లిప్‌కార్ట్‌లో కొనొచ్చు. రీటైల్ స్టోర్లలో కూడా లభిస్తుంది. కాస్మిక్ బ్లాక్, అరోరా గ్రీన్, క్రీమీ వైట్ కలర్స్‌లో లభిస్తుంది. జియో నుంచి రూ.2,500 విలువైన బెనిఫిట్స్, రూ.700 ఫ్లాట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుందని కంపెనీ చెబుతోంది.

మోటో ఇ13 ఫీచర్స్

మోటో ఇ13 స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. యూనిసోక్ టీ606 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 4జీబీ వరకు ర్యామ్, 64జీబీ స్టోరేజ్ లభిస్తుంది. మెమొరీ కార్డుతో 1టీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు.

మోటో ఇ13 స్మార్ట్‌ఫోన్‌లో 13మెగాపిక్సెల్ రియర్ కెమెరా ఉండగా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. కెమెరాలో పోర్ట్‌రైట్, ఫోటో, పనోరమా, ప్రో మోడ్, ఆటో స్మైల్ క్యాప్చర్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా, 10వాట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. డ్యూయెల్ సిమ్, వైఫై, బ్లూటూత్, టైప్ సీ పోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

మోటోరోలా నుంచి ఇప్పటికే రూ.10,000 లోపు బడ్జెట్‌లో మోటో ఇ32 స్మార్ట్‌ఫోన్ ఉంది. ధర రూ.8,999. ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే, మీడియాటెక్ హీలియో జీ37 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *