Sun Transit in Aquarius 2023 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శని దేవుని రాశి అయిన కుంభరాశిలోకి సూర్యుడు మరో నాలుగు రోజుల్లో సంచారం చేయనున్నాడు. అయితే ఈ రాశిలో ఇప్పటికే శనిదేవుడు నివాసం ఉంటున్నాడు.
Sun Transit in Aquarius 2023 వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవ గ్రహాలలో సూర్యుడిని రారాజుగా పరిగణిస్తారు. ఇంతటి గొప్ప ప్రాధాన్యత ఉన్న సూర్యుడు 13 ఫిబ్రవరి 2023 సోమవారం రోజున మకరరాశి నుంచి కుంభరాశిలోకి సంచారం చేయనున్నాడు. మరోవైపు ఇదే రాశిలో ఇప్పటికే శనిదేవుడు నివాసం ఉంటున్నాడు. శని దేవుడిని న్యాయాధిపతిగా భావిస్తారు. ఈ సమయంలో సూర్యుడు, శని గ్రహాల మధ్య ముఖాముఖి పోరు జరగనుంది. ఈ నేపథ్యంలో ద్వాదశ రాశులపై ప్రభావం పడనుంది. అయితే సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశించడంతో ప్రత్యేకించి ఈ 5 రాశుల వారికి తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడనుంది. ఈ సందర్భంగా ఆ రాశి చక్రాలేవో ఇప్పుడు తెలుసుకుందాం…
కర్కాటక రాశి(Cancer)..
ఈ రాశి నుంచి సూర్యుడు ఎనిమిదో స్థానం నుంచి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో కర్కాటక రాశి వారు వస్తువులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎందుకంటే ఈ కాలంలో మీ విలువైన వస్తువులు కొన్ని దొంగిలించబడొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. మీరు ధనం నష్టపోవచ్చు. ఈ సమయంలో మీరు మానసిక ఒత్తిడికి గురవుతారు.
Mahashivratri 2023 మహా శివరాత్రి వేళ ఏయే రాశుల వారికి ఈశ్వరుని అనుగ్రహం లభిస్తుందంటే…!
కన్య రాశి (Virgo)..
ఈ రాశి నుంచి సూర్యుడు ఆరో పాదం గుండా ప్రయాణం చేయనున్నాడు. ఈ సమయంలో కన్యరాశి వారు ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ ఖర్చులు కూడా గణనీయంగా పెరుగుతాయి. వ్యాపారులు చాలా దూరం ప్రయాణం చేయాల్సి రావొచ్చు. ఆరోగ్యంపైనా పూర్తి శ్రద్ధ వహించాలి. మీకు కంటికి, కడుపుకు సంబంధించి ఏదైనా సమస్యలు ఉండొచ్చు.
వృశ్చిక రాశి(Scorpio)..
ఈ రాశి నుంచి సూర్యుడు నాలుగో స్థానం నుంచి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో మీ కుటుంబ జీవితంలో అసమ్మతి లేదా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయి. మీ ఆరోగ్యంపై చాలా ప్రతికూల ప్రభావం పడుతుంది. తలనొప్పి, శరీరనొప్పి, ఛాతీ సంక్రమణ వంటి కొన్ని అనారోగ్య సమస్యలు ఉండొచ్చు. ఈ కాలంలో మీకు మానసిక పరమైన సమస్యలు ఉండొచ్చు.
మకర రాశి (Capricorn)..
ఈ రాశి నుంచి సూర్యుడు నిష్క్రమించడం వల్ల మకర రాశి వారికి ఆరోగ్య పరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. మీరు దంతాలకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యాపారులకు ఈ కాలం ప్రతికూలంగా ఉంటుంది. మీరు పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో మీ భాగస్వామితో పరస్పర బంధాలు చెడుగా ప్రభావితమవుతాయి.
కుంభ రాశి (Aquarius)..
ఈ రాశిలోకి సూర్యుడి సంచారం వల్ల కుంభరాశి వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇదే రాశిలో శని దేవుడు కూడా ఉండటం వల్ల మీకు శారీరక సమస్యలు ఎదురుకావొచ్చు. ఈ సమయంలో మీరు మానసిక ఒత్తిడిని అనుభవించే అవకాశం ఉంది. ఈ కాలంలో మీరు కోపం బయటకు చూపకుండా, ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి.
గమనిక :
ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. పై సమాచారాన్ని ‘‘సమయం తెలుగు’’ దృవీకరించడం లేదు.
Read
Latest Astrology News
and