Ajith’s Thegimpu in Netflix: సంక్రాంతి సందర్భంగా తమిళ స్టార్లు అజిత్, విజయ్ తమ సినిమాలతో పోటీ పడిన సంగతి తెలిసిందే. అజిత్ తునివు అనే సినిమాతో తమిళ ప్రేక్షకుల ముందుకు వస్తే అదే సినిమాని తెలుగులో తెగింపు పేరుతో రిలీజ్ చేశారు. హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను బోనీకపూర్ నిర్మించారు. మంజు వారియర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అజయ్, జాన్ కొక్కెన్ వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు.
ఇక ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవ్వడంతో ఓటీటీలోకి ఎప్పుడు వస్తుంది అని ప్రేక్షకులందరూ విపరీతంగా ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది. ఈ సినిమా ఫిబ్రవరి 8వ తేదీ నుంచి అంటే నిన్నటి నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. కేవలం తెలుగు భాష మాత్రమే కాదు హిందీలో కూడా ఈ వర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది, అదే విధంగా తమిళ వర్షన్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఇక రిలీజ్ కి ముందే ఈ సినిమా డిజిటల్ రైట్స్ రికార్డ్ ధరలకు నెట్ఫ్లిక్ సంస్థ దక్కించుకున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.
ఇక సామాజిక అంశాన్ని జోడించి హెచ్ వినోద్ తునివు అనే ఈ సినిమా తెరకెక్కించగా డార్క్ డెవిల్ అనే ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్ గా అజిత్ కనిపించి అభిమానులు అందరినీ అలరించాడు. ఈ సినిమాలో అజిత్ క్యారెక్టర్ మాత్రమే కాదు ఆయన యాక్టింగ్ అలాగే మంజు వారియర్ యాక్షన్ సీన్స్ అన్నీ కూడా సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. ఇక తమిళ, తెలుగు భాషలో పెద్ద ఎత్తున విడుదలైన ఈ సినిమా హిందీలో కూడా భారీ ఎత్తున రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 150 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చి పెట్టింది.
ఇక ఈ సినిమాలో సముద్రఖని పాత్ర కూడా కీలకంగా మారడంతో సముద్రఖనికి కూడా సినిమాలో మంచి రోల్ దక్కినట్లు అయింది. ఇక ఈ సినిమా కథ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది, అదేమిటంటే క్రెడిట్ కార్డులు మ్యూచువల్ ఫండ్స్ పేరుతో ప్రజలను బ్యాంకులు ఎలా మోసాలకు చేస్తున్నాయి. ఇక ప్రైవేట్ బ్యాంకులు నడుపుతున్న కొందరు వ్యక్తులు ప్రజల సొమ్మును ఎలా దోచుకుంటున్నారు అనే విషయాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు.
గతంలోనే ఇలాంటి కథతోనే సర్కారు వారి పాట అనే తెలుగు సినిమా రావడంతో ఈ సినిమా మీద తెలుగు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించలేదు, దానికి తోడు ఆ తర్వాత సంక్రాంతి సందర్భంగా విడుదలైన సినిమా కావడంతో వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య తర్వాత వారసుడు వంటి సినిమాలు కూడా ఎంట్రీ ఇవ్వడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి థియేటర్లు సంఖ్య తక్కువయింది. కాబట్టి తెలుగు వెర్షన్ కలెక్షన్స్ కూడా బాగా తక్కువగా నమోదయ్యాయి. అయితే తమిళ వర్షన్ మాత్రం వారసుడు సినిమాను దాటేసి మరీ కలెక్షన్లు రావడం గమనార్హం. మొత్తం మీద అజిత్ అభిమానులు ఎదురు చూసిన రోజు రానే వచ్చింది, దీంతో సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తూ నెట్ ఫిక్స్ లో కూడా ట్రెండింగ్ లో పెట్టేశారు.
Also Read: Anchor Shyamala Saree Photos: చీరకట్టులో కవ్విస్తున్న యాంకర్ శ్యామల.. కొంచెం ఎక్కువైంది అంటూ!
Also Read: Bandla Ganesh on Pawan: పవన్ విషయంలో మాట మార్చిన బండ్ల గణేష్..అవమానపరిచినా ఆభరణంగా ఫీలవ్వాలి అంటూ !
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ – https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ – https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook