Tirumala: తిరుమలలో మద్యం, మాంసంపై నిషేధం ఉంది. అయినా.. కొందరు మాత్రం నిబంధనలను అతిక్రమిస్తున్నారు. రూల్స్ పాటించే వారికేనని.. తమకు కాదంటూ కొందరు షికారీలు బరితెగిస్తున్నారు. తరుచూ తిరుమలలో మాంసం తింటూ.. మద్యం సేవిస్తూ పట్టుబడుతున్నారు. తాజాగా.. తిరుమలలోని షికారీ వీధిలో.. కొందరు షికారీలు మాంసం వండి తింటున్నట్టు టీటీడీ (TTD) విజిలెన్స్ అధికారులకు సమాచారం వచ్చింది. వెంటనే స్పందించిన విజిలెన్స్ అధికారులు.. అక్కడి వెళ్లారు. ఇద్దరు షికారీలను అదుపులోకి తీసుకున్నారు.
వారిని కమాండ్ కంట్రోల్ రూమ్‌కు తరలించి విచారణ చేపడుతున్నారు. వారికి మాంసం (Meat) ఎక్కడి నుంచి వచ్చింది.. ఎవరు ఇచ్చారు అనే కోణంలో విచారణ చేస్తున్నారు. తిరుమల కొండపైకి వెళ్లడానికి ముందే అందర్నీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. అలాంటిది.. భద్రతా అధికారులు షికారీల దగ్గర మాంసాన్ని ఎందుకు గుర్తించలేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే.. తాను ఎలాంటి తప్పు చేయలేదని అధికారులకు పట్టుబడిన వ్యక్తి చెబుతున్నారు. ఒక మహిళ, మరో పురుషుడిని అధికారులు అదుపులోకి తీసుకొని.. విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
కొన్ని రోజుల క్రితం Tirumala శ్రీవారి ఆలయానికి సంబంధించిన డ్రోన్ విజువల్స్ సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. దీంతో తిరుమలలో అపచారం జరిగిందంటూ భద్రతా వైఫల్యంపై సర్వత్రా విమర్శలు వినిపించాయి. ఈ ఘటన మరచిపోక ముందే.. మరోసారి తిరుమలలో అపచారం జరిగింది. భద్రత వైఫ్యలం స్పష్టంగా కనిపించింది. ఆలయ మాడవీధుల్లోకి కారు దూసుకొచ్చింది. ఇన్నోవా కారుపై CMO స్టిక్కర్ ఉండటంతో భద్రతా సిబ్బంది చూసీ చూడనట్టు వ్యవహరించారు. భద్రతా సిబ్బంది అడ్డు చెప్పకపోవడంతో కారును మాఢ వీధుల్లోకి తీసుకొచ్చాడు ఆ డ్రైవర్.
ఈ రెండు ఘటనలు మరువక ముందే.. ఇప్పుడు మాంసం తింటూ పట్టుబడటం కలకలం రేపుతోంది. ముఖ్యంగా భద్రతా (Security) విభాగంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ మద్యం, సిగరెట్లతో తిరుమలలో కొందరు పట్టుబడ్డారు. ఈ ఘటనలతో భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో పవిత్రమైన తిరుమలలో ఇలాంటి ఘటనలు జరగడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
Read Latest
Andhra Pradesh News
and