Varasudu Ott Release Date Locked: తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వారిసు అనే సినిమా తెరకెక్కింది, విజయ్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా ఈ సినిమా ప్రకటించిన సమయంలో ద్విభాషా చిత్రంగా తెరకెక్కిస్తామని ప్రకటించారు. తమిళంలో పాటు తెలుగులో కూడా తిరిగి తెరకెక్కిస్తామని అప్పట్లో ప్రకటించారు కానీ తర్వాత కాలంలో తెలుగు సినీ పరిశ్రమలో ఏర్పడిన కొన్ని పరిస్థితుల నేపథ్యంలో దాన్ని పూర్తిగా తమిళ సినిమా అని చెబుతూ వచ్చారు. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను పెద్ద ఎత్తున రిలీజ్ చేయగా థియేటర్లను బ్లాక్ చేసి మిగతా సినిమాలకు ఇబ్బంది కలిగించారని అప్పట్లో ఆయన మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి.
దీంతో 11వ తేదీన తెలుగులో విడుదల కావాల్సిన ఈ సినిమాని వాయిదా వేస్తూ చివరికి జనవరి 14వ తేదీన వారసుడు సినిమాని విడుదల చేశారు,. ఇక ఈ సినిమా కూడా విడుదలై చాలా రోజులు అవుతుంది. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో అని ప్రేక్షకులు అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాని ఓటీటీలో ఇప్పట్లో విడుదల చేసే ఆలోచన లేదని అంటున్నారు. వాస్తవానికి ఈ సినిమా డిజిటల్ హక్కులను సినిమా రిలీజ్ కంటే ముందే దాదాపు 100 కోట్ల రూపాయలు వెచ్చించి అమెజాన్ ప్రైమ్ సంస్థ కొనుక్కున్నట్టు ప్రచారం జరిగింది.
ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 10వ తేదీ అంటే రేపు శుక్రవారం నుంచి ఈ సినిమా తెలుగు సహా తమిళ వర్షం ఓటిటీలో రిలీజ్ అవుతుందని భావిస్తే కొన్నిచోట్ల ఇంకా ఈ సినిమా ప్రదర్శితం అవుతూ ఉండడంతో సినిమాని ఇప్పట్లో ఓటీటీలో రిలీజ్ చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దానికి తగ్గట్లుగా ఓటీటీ రిలీజ్ కి థియేటర్ రిలీజ్ కి మధ్య 40 రోజుల వ్యవధి కచ్చితంగా పాటించాలని తెలుగు నిర్మాతల మండలి నిర్ణయం తీసుకోవడంతో ఈ సినిమాని ఫిబ్రవరి 22వ తర్వాత స్ట్రీమింగ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పూర్తిస్థాయి కుటుంబ కదా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ సోదరులుగా శ్రీకాంత్, కిక్ శ్యామ్ నటించగా విజయ్ తల్లిదండ్రుల పాత్రలలో శరత్ కుమార్, జయసుధ నటించారు. ఇక విజయ్ ప్రియురాలి పాత్రలో రష్మిక మందన నటించింది. ఇక అపార్థాల వల్ల విడిపోయిన ముగ్గురు అన్నదమ్ములు చివరికి తండ్రి కోసం ఎలా కలిశారు? అనే కాన్సెప్ట్ మీద ఈ సినిమా తెరకెక్కించారు. జనవరి 11వ తేదీన విడుదలైన వారిసు తమిళనాడులో మాత్రం అజిత్ సినిమా కంటే వెనుకబడినా ప్రపంచవ్యాప్తంగా మొత్తం మీద 300 కోట్లకు పైగా కలెక్షన్లు కాబట్టి విజయ్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. తెలుగు వెర్షన్ కూడా దాదాపు 20 కోట్లకు పైగా వసూలు చేసిందని ట్రేడ్ వర్గాల అంచనా. అయితే ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి రాబోతుంది? అనే విషయం మీద అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Also Read: Bandla Ganesh on Pawan: పవన్ విషయంలో మాట మార్చిన బండ్ల గణేష్..అవమానపరిచినా ఆభరణంగా ఫీలవ్వాలి అంటూ !
Also Read: Thegimpu OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన అజిత్ తెగింపు.. ఎందులో చూడాలో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ – https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ – https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook