Why Cars Catches Fire: కార్లలో మంటలు ఎందుకు వస్తాయో తెలిస్తే మీరు కూడా జాగ్రత్త పడతారు

Why Cars Catches Fire: కార్లలో తరచుగా చోటుచేసుకుంటున్న అగ్ని ప్రమాదాలు కార్లు మెయింటెన్ చేసే వారిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొన్నిసార్లు కార్లు రన్నింగ్‌లో ఉండగానే నిప్పంటుకుంటే.. ఇంకొన్నిసార్లు నిలిపి ఉన్న కార్లలోనూ మంటలు అంటుకున్న సందర్భాలు ఉన్నాయి. చూస్తుండగానే కొన్ని నిమిషాల్లోనే మంటలు కారు నిండా వ్యాపించి కళ్ల ముందే కాలిబూడిదైన కార్లు ఎన్నో ఉన్నాయి. ఇంతకీ కార్లు ఎందుకు తగలబడతాయి ? ఉన్నట్టుండి కార్లలో ఎందుకు నిప్పు రాజుకుంటుంది ? కార్ల యజమానులు, కార్ల డ్రైవర్లను వెంటాడే సందేహాలు ఇవే. 

కారులో మంటలు రాజుకోవడానికి కారణాలు ఏంటో తెలిస్తే అలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. అందుకే కార్లు మెయింటెన్ చేసే వారికి ఉపయోగపడేలా ఈ విలువైన సమాచారాన్ని మీకు అందిస్తున్నాం.

డిజైన్‌లో లోపాలు    

కార్ల తయారీలో వైవిద్యం కోసం కొన్ని కంపెనీలు కొత్త మోడల్స్ తయారు చేసేటప్పుడు స్విచెస్ ఉండే స్థానాలను మారుస్తుంటాయి. ఇవి కొన్నిసార్లు బ్యాక్ ఫైర్ అవడంతో అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి ఘటనలు చాలా అరుదుగానే జరుగుతుంటాయి. డిజైన్‌లో లోపాలు ఏమైనా తలెత్తినట్టు కార్ల కంపెనీలు గుర్తిస్తే.. ప్రమాదాలను నివారించడం కోసం కంపెనీలు ఆ మోడల్‌కి సంబంధించిన కార్లను వెంటనే రీకాల్ చేస్తుంటాయి. 

పూర్ మెయింటెనెన్స్

కార్లను ఎప్పటికప్పుడు సర్విసింగ్ చేయిస్తుండాలి. ఒకవేళ ఏవైనా పార్ట్స్ చెడిపోవడం, సీల్ లీక్ అవుతుండటం, వైరింగ్‌లో లోపాలు తలెత్తడం వంటి సమస్యలను ఎప్పటికప్పుడు గమనించి వెనువెంటనే  పరిష్కరించుకోకపోతే.. అవి పెద్ద సమస్యలుగా మారి ఏ క్షణమైనా అగ్ని ప్రమాదాలకు దారితీయొచ్చు. ముఖ్యంగా వాహనంలో బ్యాటరీ, వైరింగ్, లీకేజీ లాంటి లోపాలు తలెత్తినప్పుడు వాటిపై తక్షణమే దృష్టిసారించి సమస్యను పరిష్కరించుకోవాలి.

అనవసర మోడిఫికేషన్స్

వాహనాల్లో కొంతమంది తరచుగా మ్యూజిక్ సిస్టం, ఇన్ఫోటెయిన్ మెంట్ చేంజ్ చేయిస్తుంటారు. అలా చేసే క్రమంలో మార్కెట్లో లభించే పరికరాలనే ఉపయోగించి వైర్లు అటాచ్ చేస్తుంటారు. ఆ పరికరాల్లోని పూర్ క్వాలిటీ ప్రభావంతో వైరింగ్‌లో జరిగే లీకేజీ, షార్ట్ సర్క్యూట్స్ కారులో మంటలకు కారణం అవుతుంటాయి.  

హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వాహనాలు

టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన ఓ కథనం ప్రకారం బ్యాటరీ ప్యాక్స్‌తో వచ్చే హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాల్లో అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని తెలుస్తోంది. హీట్ మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోవడంతో పాటు బ్యాటరీ కెమికల్స్, సెల్ ఆర్కిటెక్చర్ వంటి అంశాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

ఓవర్ హీటింగ్ కెటాలిటిక్ కన్వర్టర్స్

కారు సర్విసింగ్ చేయించే క్రమంలో హీటింగ్ కెటాలిటిక్ కన్వర్టర్స్ ని తరచుగా చెక్ చేయించాలి. వీటిని నిర్లక్ష్యం చేయడం వల్ల అవి కొన్ని సందర్భాల్లో ఓవర్ హీట్ అవడం వల్ల అగ్ని ప్రమాదం సంభవించే ప్రమాదం ఉంటుంది.

ఓవర్ హీటింగ్ ఇంజన్స్

వెహికిల్ సర్విసింగ్ లో గమించుకోవాల్సిన మరో అంశం ఏంటంటే ఇంజన్ కండిషన్ ఎలా ఉంటుందనేది. ఇంజన్ ఓవర్ హీటింగ్ అవుతున్నట్టయితే.. వెంటనే ఆ సమస్యను పరిష్కరించుకోవాలి. లేదంటే ఆ సమస్య వల్లే వాహనం తగలబడే ప్రమాదం ఉంటుంది.

ఫ్లూయిడ్స్ లీకేజీ

ఇంజన్ ఓవర్ హీట్ వల్ల ఆయిల్, కూలంట్స్ లాంటి ఫ్లూయిడ్స్ కూడా హీటెక్కి బయటికి కక్కడంతో నిప్పంటుకునే ప్రమాదం ఉంటుంది. కొన్నిసందర్భాల్లో పెట్రోల్ , డీజిల్ కూడా హీటెక్కి అగ్ని ప్రమాదాలకు దారితీస్తాయి. అదే కానీ జరిగితే ఆ ప్రమాదం తీవ్రత అధికంగా ఉంటుంది. అది కూడా క్షణాల వ్యవధిలోనే వాహనాలు కాలిబూడిదవుతాయి. అందుకే ఓవర్ హీటింగ్ ఇంజన్స్ తో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.

ఫ్యూయెల్ లీకేజ్

కారులోంచి ఫ్యూయెల్ లీక్ అయినట్టయితే.. అలా లీక్ అయిన ఫ్యూయెల్‌తో రోడ్డుపై ఒక్క నిప్పు రవ్వ తాకినా ఆ వాహనానికి మంటలు అంటుకుని కాలిబూడిదయ్యే ప్రమాదం ఉంటుంది.

ఇది కూడా చదవండి : Highest Selling Car Brands: ప్రస్తుతం ఎక్కువగా సేల్ అవుతున్న కార్లు ఇవే

ఇది కూడా చదవండి : Maruti Cars Discount: కొత్తగా కారు కొనేవారికి గుడ్ న్యూస్.. మారుతి కార్లపై రూ. 46 వేల వరకు డిస్కౌంట్.. ఫుల్ డీటేల్స్

ఇది కూడా చదవండి : Oneplus 5G Smartphones: వన్‌ప్లస్ నుంచి తక్కువ ధరకే మరో సూపర్ స్మార్ట్‌ఫోన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ –  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ –  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *