ఆడపిల్లలు పుట్టడానికి కారణం చెప్పిన ఎమ్మెల్యే ఆడపిల్లలు జన్మించడానికి గల కారణాన్ని అసెంబ్లీలో వికారాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ చెప్పారు. ఆడపిల్ల పుట్టడానికి సైంటిఫిక్ గా మగాడే కారణమని ఆడవాళ్లు ఏ మాత్రం కారణం కాదని చెప్పారు. భార్యభర్తల నుంచి వచ్చే XY క్రోమోజోములే కారణమని వివరించారు.
‘సైంటిఫిక్ గా భార్య లోపల X క్రోమోజోమ్ లు మాత్రమే ఉంటాయి, భర్త లోపల XY క్రోమోజోములుంటాయి. భార్య నుంచి వచ్చిన X క్రోమోజోమ్, భర్త నుంచి వచ్చిన X క్రోమోజోమ్(XX) కలిస్తే ఆడపిల్ల పుడ్తది. భర్త నుంచి వచ్చిన Y క్రోమోజోమ్ భార్య నుంచి వచ్చే X క్రోమోజోమ్(XY) తో కలిస్తే మగపిల్లలు పుడ్తరు. Y క్రోమోజోమ్ మగవాళ్ల నుంచి రిలీజ్ కాకపోవడంతోనే ఆడపిల్లలు జన్మిస్తున్నారు. అంటే ఆడపిల్లలు పుట్టడానికి కారణం మగవాళ్లు.. కాబట్టి మగ వారినే కొట్టి ఇంటి నుంచి బయటకు గెంటేయాలి’ అని ఎమ్మెల్యే ఆనంద్ వ్యాఖ్యానించారు.
©️ VIL Media Pvt Ltd.