ఆ ముగ్గురిని RRR తో పోలుస్తూ సచిన్ ప్రశంసలు ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్టులో భారత్ రెండో రోజు ముగిసే సమయానికి 144 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. అయితే ఈ టెస్టులో బౌలింగ్ లో గాయం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన రవీంద్ర జడేజా, రవిచంద్ర అశ్విన్, బ్యాటింగ్ లో రాణించిన కెప్టెన్ రోహిత్ శర్మపై టీమిండియా మాజీ దిగ్గజం సచిన్ టెండుల్కర్ ప్రశంసలు కురిపించారు. రోహిత్,రవీంద్రజడేజా,రవిచంద్రన్ RRR అంటూ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ టెస్టులో భారత్ ఆధిక్యం సాధించడంలో ఈ ముగ్గురు కీలక పాత్ర పోషించారని తెలిపారు. రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఆర్ఆర్ఆర్ కు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వచ్చిన సంగతి తెలిసిందే.. అలాగే నాటు నాటు సాంగ్ ఒరిజనల్ కేటగిరిలో ఆస్కార్ బరిలో కూడా నిలిచింది.
తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ 120 పరుగులు చేయగా.. రవీంద్ర జడేజా5 వికెట్లు, అశ్విన్ 3 వికెట్లు తీశారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 7 వికెట్లు కోల్పోయి 321 పరుగులు చేసింది. 144 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
©️ VIL Media Pvt Ltd.