ఆ రూమర్స్​ నమ్మొద్దు: త్రిష తల్లి

ఆ రూమర్స్​ నమ్మొద్దు: త్రిష తల్లి తమిళ హీరో విజయ్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘లియో’. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ లో సీనియర్ హీరోయిన్ త్రిష నటిస్తోంది. అయితే ఈ సినిమా నుంచి త్రిష తప్పుకుందని వదంతులు​రావడం తెలిసిందే.  ఇటీవల ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ కోసం టీమ్ అంతా కాశ్మీర్ కు వెళ్లింది. కానీ ఆ షెడ్యూల్ పూర్తి కాకుండానే త్రిష మూవీ నుంచి తప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా త్రిష తల్లి ఉమా కృష్ణన్​ ఈ రూమార్స్​పై స్పందించారు. ‘లియో ప్రాజెక్టులో త్రిష నటించడం లేదన్న వదంతుల్లో వాస్తవం లేదని తెలిపింది. కశ్మీర్​ షూటింగ్​లో చల్లటి వాతావరణానికి అనారోగ్యం బారిన పడి ఇంటికి వచ్చింది’ అని ఆమె చెప్పారు. ఇప్పుడు కాశ్మీర్ లో ‘లియో’ షూటింగ్ లో ఉందని స్పష్టం చేసింది. త్రిష కూడా తన ఇన్ స్టాలో కశ్మీర్ షూటింగ్​ పిక్స్​ను పోస్టు చేసి వదంతులకు పుల్​స్టాప్​పెట్టింది.

ఇక విజయ్, త్రిష దాదాపు 14 ఏళ్ల తర్వాత మళ్లీ కలసి నటిస్తున్నారు. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఇందులో మరో హీరోయిన్‌గా ప్రియా ఆనంద్‌ను ఎంపిక చేశారు. బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్, మన్సూర్‌ అలీఖాన్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం సమకూరుస్తున్నారు. లలిత్ కుమార్ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను ఒకేసారి విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 

©️ VIL Media Pvt Ltd.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *