క్రెడిట్ కార్డుతోనూ యూపీఐ పేమెంట్స్.. పేటీఎం కీలక నిర్ణయం.. వీరికి మాత్రమే..!

UPI: ప్రస్తుత రోజుల్లో ప్రతిఒక్కరు యూనిఫైట్ పేమెంట్స్ ఇంటర్‌ ఫేస్ (యూపీఐ) పేమెంట్స్ చేస్తున్నారు. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్స్ తో డెబిట్ కార్డ్ ద్వారా లింక్ చేసుకుని ఈజీగా రిటైల్ చెల్లింపులు చేస్తున్నారు. రోజుకు కోట్లలో ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయంటే ప్రస్తుతం యూపీఐకి ఎంత ఆదరణ ఉందో ఊహించవచ్చు. అయితే, రూపే క్రెడిట్ కార్డు వాడే వారు సైతం పాయింట్ ఆఫ్ సేల్ మిషన్ లేకుండానే యూపీఐ ద్వారా చెల్లింపులు చేయొచ్చు. అందుకోసం పేటీఎం కీలక నిర్ణయం తీసుకుంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్) గత మంగళవారం ఈ మేరకు రూపే క్రెడిట్ కార్డ్ ఆన్ యూపీఐ సేవలను లాంఛ్ చేసింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ ఫేస్ సేవలకు రూపే క్రెడిట్ కార్డ్ లింక్ చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు తెలిపింది.

యూపీఐ సర్వీసుల ద్వారా రూపే క్రెడిట్ కార్డు ఉన్నవారు ఆన్‌లైన్ లేదా ఆఫ్ లైన్ మార్చంట్స్ వద్ద చెల్లింపులు చేయొచ్చు. రూపే క్రెడిట్ కారడులను నేరుగా యూపీఐ ఐటీలకు లింక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి రిటైల్ వ్యాపారులకు ఈజీగా చెల్లింపులు చేయవచ్చు. రూపే క్రెడిట్ కార్డుల చెల్లింపులను పాయింట్ ఆఫ్ సేల్ టెర్మినల్ అవసరం లేకుండానే రిటైల్ చెల్లింపులు చేయొచ్చు.

97769554

క్రెడిట్ కార్డులను ఉపయోగించి పేమెంట్స్ చేయడం ద్వారా రూపే క్రెడిట్ కార్డులకు ఆదరణ పెరుగుతుందని పీపీబీఎల్ పేర్కొంది. సింగిల్ యూపీఐ యాప్ ద్వారా చేసే చెల్లింపుల ద్వారా డిజిటల్ ఎక్స్‌పీరియన్స్ తో పాటు రివార్డ్స్, బెనిఫిట్స్ అందుతాయని పేర్కొంది. ఆన్‌లైన్, ఆఫ్ లైనా విధానంలో చాలా సులభంగా చెల్లింపులు చేసే వీలు కల్పించడం ద్వారా రూపే క్రెడిట్ కార్డుల వినియోగం పెరుగుతుందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ్ రాయ్ పేర్కొన్నారు.

ఎన్‌పీసీఐ ఇప్పటికే దేశంలోని టాప్ లెండర్స్‌తో ఈ దిశగా చర్యలు చేపట్టింది. ఐసీఐసీ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంకులతో చర్చించి.. రూపే క్రెడిట్ కార్డులకు యూపీఐ సేవలను పొడిగించాలను కోరుతోంది. గత ఏడాది జూన్ లోనే క్రెడిట్ కార్డులను యూపీఐ పేమెంట్స్ కి లింక్ చేసేందుకు అనుమతించబోతున్నట్లు ప్రకటించారు ఆర్‌బీఐ గవర్నర్ శక్తి కాంత దాస్.

97765388

LIC: కస్టమర్లకు ఎల్ఐసీ గుడ్‌న్యూస్.. వారికి మరో అవకాశం.. మార్చి 24 తుది గడువు..!

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *