G Venkatesh, News18, Anantapuram
ఏపీలో పొలిటికల్ హీట్ ఎక్కడా తగ్గడం లేదు. ఓ వైపు లోకేష్ పాదయాత్ర (Lokesh Padayatra).. మరోవైపు టీడీపీ (TDP) నేతల అరెస్టులతో వాతావరణం వేడెక్కుతోంది. తాజాగా అనంతపురం జిల్లా (Anantapuram District) లోని పెద్దపప్పూరు మండలంలో ఉల్లికల్లు వద్ద తీవ్ర ఉదృతత నెలకొంది. జేసి ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) కార్యకర్తలతో కలిసి ధర్నాకు దిగడంతో ఒకసారిగా గందరగోళం ఏర్పడింది. అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా సొంత ప్రయోజనాలకే ఇసుకను తరలిస్తున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ఉల్లికల్లు వద్ద పెన్నా నది నుంచి ఇసుకను తరలించి ఇక్కడ ఎటువంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేశారని కలిసి జేసీ ప్రభాకర్ రెడ్డి ధర్నా నిర్వహించారు.జిల్లాలోని ఉల్లికల్లు ఇసుక రీచ్ వద్ద తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి గురువారం నాడు ఆందోళనకు దిగారు.
అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అనుమతి లేకుండా ఉల్లికల్లు ఇసుక రీచ్ నుండి ఇసుకను తరలిస్తున్నవారిపై కేసు నమోదు చేయాలని జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉల్లికల్లు ఇసుక రీచ్ వద్ద రోడ్డుపై బైఠాయించిన జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఉల్లికల్లు ఇసుక రీచ్ కు అనుమతి ఉంటే అనుమతి పత్రాలు చూపాలని జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అక్రమంగా ఇస్కుని తరలిస్తున్నారని అధికారం అడ్డం పెట్టుకొని నాయకులు విచ్చలవిడిగా ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఉల్లికల వద్ద ఉన్న ఇసుకరించుకు ఎలాంటి అనుమతులు లేవని అనుమతులు ఉంటే మైన్స్ అధికారులు, తహసీల్దార్ పత్రాలుచూపాలని ఆయన కోరారు.
ఇది చదవండి: ఏపీలో ప్రాచీన జైన మందిరం.. ప్రశాంతతకు చిహ్నంగా నిర్మాణం
ధర్నాకు దిగిన జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి పెద్దపప్పూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీస్ స్టేషన్ కు తరలించే సమయంలో పోలీసులతో జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీనితో కార్యకర్తలు అరెస్టును అడ్డుకోవడంతో తీవ్ర ఉదృతకు దారితీసింది జెసి ప్రభాకర్ రెడ్డిని పెద్దపప్పూరు పోలీస్ స్టేషన్కు తరలించారు.