Tech Layoffs: ఆర్థిక మాంద్యం భయాలతో ఖర్చులు తగ్గించుకోవటమంటూ టెక్ కంపెనీలు ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగాల తొలగింపు చేపట్టాయి. వేలాది మందిని ఉన్నఫలంగా తొలగించి ఉద్యోగుల భవిష్యత్తును అంధకారంలోకి పడేశాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా వంటి దిగ్గజ సంస్థలు సైతం ఉద్యోగులను తొలగించడం, ఉన్న వారి జీతాల్లో కోత పెట్టడం వంటి చర్యలు చేపట్టాయి. ఇంకా ఈ దారుణ పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. రోజుకో సంస్థ ఉద్యోగులకు షాకులు ఇస్తునే ఉంది. 2023 కొత్త ఏడాదిలో ప్రపంచ వ్యాప్తంగా 332 టెక్ కంపెనీలు ఉద్యోగాల కోత చేపట్టినట్లు layoffs.fyi అనే సంస్థ వెల్లడించింది. మొత్తంగా అన్ని సంస్థలు కలిపి 2023లోనే 1,00,746 మందిని ఉద్యోగాల్లోంచి పీకేశాయి.
2023లోనే పెద్ద సంఖ్యలో లేఆఫ్స్ జరిగాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, సేల్స్‌ఫేర్స్, అమెజాన్ వంటివి వేల సంఖ్యలో తొలగించాయి. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ప్రపంచవ్యాప్తంగా 6 శాతం ఉద్యోగులను అంటే 12 వేల మందికి పింక్ స్లిప్స్ ఇచ్చింది. మైక్రోసాఫ్ట్ 10 వేల మందిని తొలగించింది. అమెజాన్ 8 వేల మందిని ఇంటికి పంపించింది. వీటితో పాటు సేల్స్ ఫోర్స్ 8 వేలు, డెల్ 6,650, ఐబీఎం 3,900, సాప్ 3 వేల మందిని తొలగించాయి.
తాజాగా ఈ ఉద్యోగాల కోతకు యాహూ చేరిపోయింది. సుమారు 20 శాతం మందిని తొలగిస్తున్నట్లు చెప్పింది. అంటే దాదాపు 1,600 మందిపై ఈ ప్రభావం పడనుంది. ప్రస్తుతం 12 శాతం మందిని అంటే 1000 మందిని తొలగించి వచ్చే ఆరు నెలల్లో 8 శాతం మందిని లేదా 600 మందిని తొలగించనున్నట్లు ప్రకటించింది యాహూ.
2023లో ఉద్యోగాల కోత పెట్టిన ప్రధాన కంపెనీలు..
మైక్రోసాఫ్ట్ లేఆఫ్స్… 10,000 మంది (5 శాతం ఉద్యోగులు)
అమెజాన్ లేఆఫ్స్… 8,000 మంది (3 శాతం)
సేల్స్‌ఫోర్స్ లేఆఫ్స్.. 8,000 (10 శాతం)
డెల్ లేఆఫ్స్.. 6,650 (5 శాతం ఉద్యోగులు)
ఐబీఎం లేఆఫ్స్.. 3,900 (2శాతం మంది)
సాప్ లేఆఫ్స్… 3,000 (3 శాతం)
జూమ్ లేఆఫ్స్… 950 (20 శాతం)
యాహూ లేఆఫ్స్… 1,600 (20 శాతం)
గిట్‌హబ్ లేఆఫ్స్… 300 (10 శాతం)
Read Latest
Business News and Telugu News
Also Read:
ఎల్‌ఐసీకి 27 రెట్ల లాభం.. వేల కోట్లతో దుమ్మురేపిందిగా.. అదానీ ఎఫెక్ట్ ఏం లేనట్లేనా?
Also Read:
‘భారత్‌ను అందుకే నమ్ముతా’.. 4 కారణాలు చెప్పిన ముకేశ్ అంబానీ!