నోట్ల రద్దుతో రూ.7961 కోట్లు బ్లాక్‌మనీ సీజ్ 2016లో కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన నోట్ల రద్దు బడాబాబుల బ్లాక్ మనీని బయటకు తీసింది. ప్రభుత్వ ఖజానాకు గండికొట్టిన నల్ల కుబేరుల నుంచి వేల కోట్ల రూపాయలను సీజ్ చేసింది. 5 నెలల్లోనే సుమారు రూ. 800 కోట్లు స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఈ వివరాలు సేకరించింది. డీ మానిటైజేషన్ తరువాత ఎంత బ్లాక్ మనీ గుర్తించారని గత నెల 24న ఫౌండర్ రాజేంద్ర పల్నాటి ఆర్టీఐ కింద వివరాలు కోరారు. ఐటీ పబ్లిక్ ఇన్‌ఫర్మేషన్ ఆఫీసర్ అభినవ్ అగర్వాల్ 27న ఈ వివరాలు వెల్లడించారు.
నోట్లరద్దు అమల్లోకి వచ్చిన తరువాత 2016 నవంబర్ నుంచి 2017 మార్చి వరకు దేశవ్యాప్తంగా దాడులు చేసినట్లు కేంద్రం తెలిపింది. 900 స్పెషల్ టీమ్స్‌తో సోదాలు జరిపినట్లు చెప్పింది. ఈ తనిఖీల్లో రూ.636 కోట్లు క్యాష్ సహా మొత్తం రూ.900 కోట్లు లెక్కలు లేని డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 5 నెలల వ్యవధిలో దేశవ్యాప్తంగా మొత్తం రూ. 7,961 కోట్లు బ్లాక్ మనీని స్వాధీనం చేసుకున్నట్లు అభినవ్ అగర్వాల్ వెల్లడించారు.
©️ VIL Media Pvt Ltd.