పడవలో నుంచి సముద్రంలో విసరేసిన 18 కిలోల బంగారం.. చివరిలో ట్విస్ట్

భద్రతా దళాలకు చిక్కకుండా సముద్రంలో స్మగ్లింగ్ ముఠా విసిరేసిన బంగారం బిస్కెట్లను తమిళనాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రామేశ్వరం వద్ద బుధవారం తీరప్రాంత గస్తీ దళం తిరుగుతుండగా అనుమానాస్పదంగా ఉన్న ఓ పడవ కనిపించింది. అటుగా గస్తీ దళాలు వెళ్లడంతో పడవలో ఉన్నవారు బంగారు బిస్కెట్లను సముద్రంలో పడేశారు. తమ వద్ద ఏమీ లేవని దబాయించారు. కానీ, వారి వ్యవహారశైలి, ప్రవర్తను అనుమానించిన పోలీసులు.. స్కూబా డైవింగ్‌ చేసే వారిని రప్పించారు.

వారు సముద్రం అడుగుకు చేరుకుని గాలించగా బంగారు బిస్కెట్లు లభ్యమయ్యాయి. దీంతో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం రూ.10.5 కోట్ల విలువైన 17.74 కిలోల బంగారం బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారాన్ని శ్రీలంక నుంచి అక్రమంగా తమిళనాడులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినట్టు పోలీసులు తెలిపారు. శ్రీలంక నుంచి మండపం తీరానికి బంగారాన్ని అక్రమంగా తీసుకొస్తున్నట్టు సమాచారం అందుకున్న డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్.. స్మగ్లర్లను పట్టుకోడానికి ఇండియన్ కోస్ట్‌గార్డ్ సాయం తీసుకుంది.

దీంతో డీఆర్ఐ, కోస్ట్‌గార్డ్ సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి. బుధవారం రాత్రి రామేశ్వరం జిల్లా మండపం తీరం వలైగుడా ప్రాంతంలో అనుమానాస్పదరీతిలో ఓ పడవ వారి కంటబడింది. భద్రతా దళాలను చూసి అప్రమత్తమైన నిందితులు.. బంగారం బిస్కెట్లను సముద్రంలో విసిరేశారు. తనిఖీలో ఏమీ లభించకపోవడంతో స్కూబా డైవర్స్‌ను రప్పించి, గురువారం ఉదయం గాలించడంతో సముద్రం అడుగు భాగంలో బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. బంగారు బిస్కెట్లతో పాటు మండపానికి చెందిన నగూర్ కనీ, సగుబేర్ సాదిక్, మారకాయరిపట్టినమ్‌కి చెందిన మహ్మద్ సమీర్‌ను అరెస్ట్ చేశారు. వారిని మెరైన పోలీసులకు అప్పగించారు.

Read Latest National News And Telugu News

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *