పాముని మెడలో వేసుకొని ఆటలాడితే ఎలా ఉంటుందో ఈ వీడియో చూడండి..

పాములతో ఆటలొద్దని చెబితే ఎవరైనా వింటారా. అతను వినలేదు. అందుకే పాము(Snake)నోట్లో నోరు పెట్టి ముద్దు పెట్టుకోవాలనుకున్నాడు. సీన్ కట్ చేస్తే ఆ పాము సేమ్ అలాగే చేసింది. ఒక్క కాటుతో అతను కైలాసానికి వెళ్లాడు. బీహార్‌(Bihar)లో ఓ వ్యక్తి మద్యం మత్తులో ఇంటి ఆవరణలో దొరికిన పామును మెడలో వేసుకొని ఊరంతా తిరిగాడు. అతడ్ని చూసిన గ్రామస్తులు వదిలెయ్‌రా బాబు అని ఎంత చెప్పినా వినకుండా గురూజీ గురూజీ అంటూ విషసర్పాన్ని ముద్దాడుతూ రోడ్లపై బిల్డప్ ఇచ్చారు. సివాన్ (Sivan)జిల్లాలో ఈసంఘటన జరిగింది. పామును మెడలో వేసుకొని పరమశివుడిలా తిరిగిన వ్యక్తిని పెదవిపై కాటు వేయడంతో ప్రాణాలు విడిచారు.పాముని మెడలో వేసుకొని తిరుగుతుండగా గ్రామస్తులు తీసిన వీడియో(Video) ఇప్పుడు సోషల్ మీడియా(Social media)లో వైరల్ (Viral)అవుతున్నాయి.

Sakhibala Mandal: 110 ఏళ్ల బామ్మకు కొత్తగా వచ్చిన దంతాలు, వెంట్రుకలు .. ఈ ఆశ్చర్యకర ఘటన ఎక్కడ జరిగిందంటే..?

పాముతో ఆటలు..

బీహార్‌లోని సివాన్‌లో ఒ విచారకరమైన సంఘటన స్థానికుల్ని తీవ్రంగా బాధించింది. మైర్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని టిట్రా గ్రామానికి చెందిన ఇంద్రజిత్ రామ్ అనే వ్యక్తి మద్యం మత్తులో ఓ విషసర్పాన్ని పట్టుకున్నాడు. ఇంట్లో ఇటుకలు తీస్తుండగా పాము కనిపించడంతో దాన్ని తీసుకొని మెడలో వేసుకున్నాడు. అంతటితో ఆగకుండా మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో తెలియకుండా దాన్ని పట్టుకొని గంటల తరబడి గ్రామంలోని రోడ్లపై తిరిగాడు. పదే పదే నోటితో విషసర్పాన్ని ముద్దుపెట్టుకున్నాడు. ఈ క్రమంలో మెడలో ఉన్న విషసర్పం అతని పెదవిపై కాటేసింది.ఇంద్రజిత్‌రామ్‌ పరిస్థితి విషమంగా మారింది.

ప్రాణం తీసిన సరదా ..

పాముతో సరదా తీర్చుకున్న ఇంద్రజిత్‌రామ్‌ను పాము కాటేసిన విషయం గ్రహించిన స్థానికులు అతడ్ని చికిత్స కోసం శివన్ సదర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు నిర్ధారించారు. అయితే పాము కాటేయడానికి కారణం దానిపై కొందరు డీజిల్ పోశారని అది స్పృహ కోల్పోయిందనుకొని ఇంద్రజిత్ రామ్ మెడలో వేసుకొని దాంతో ఆడుకున్నాడు. ఈక్రమంలోనే అది కాటేసింది.

వైరల్ అవుతున్న వీడియో ..

పాముతో ఆటలాడుకున్న వ్యక్తి చనిపోయే ముందు గ్రామస్తుల ముందు ధైర్యంగా మెడలో వేసుకొని తిరగడం, కాన్ని ముద్దుపెట్టుకోవడం చూసిన జనం భయపడిపోయారు. ఆ సమయంలోనే అతడ్ని వీడియో తీశారు. అతను చనిపోయిన తర్వాత ఇప్పుడు ఆ వీడియోనే వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *