పీఎఫ్ వడ్డీ మీ అకౌంట్‌లో పడిందా? ఈసారి చాలా తక్కువ.. ఇలా చెక్ చేస్కోండి!

PF Interest Rate: ప్రావిడెంట్ ఫండ్ చందాదారులకు (PF) కేంద్రం మరోసారి షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పీఎఫ్ వడ్డీ రేట్లను గతంలో కంటే ఈసారి మరింత తగ్గించనున్నట్లు వార్తలొస్తున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పీఎఫ్ వడ్డీ రేటు 8.10 శాతంగా ఉండగా.. ఈసారి అది మరింత తక్కువగా అంటే 8 శాతం వరకే ఉండొచ్చని తెలుస్తోంది. ఇప్పటికే గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వడ్డీ రేటును చందాదారుల అకౌంట్లలోకి జమ చేసే ప్రక్రియ మొదలైందని చెబుతున్నా.. చాలా మంది ఇంకా తమ అకౌంట్లలో పడలేదని చెబుతున్నారు.

కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో.. ఇన్వెస్ట్‌మెంట్లపై చాలా మందికి అధిక రిటర్న్స్ వచ్చాయని, ఇదే సమయంలో ఉపసంహరణలు కూడా తగ్గిపోయాయని ఈపీఎఫ్‌ఓ చెబుతోంది. అందుకే ఈసారి 8 శాతం వడ్డీ రేటుగా ఉంచొచ్చని సమాచారం. అయితే.. గత ఆర్థిక సంవత్సరం ఇచ్చిన 8.10 శాతం వడ్డీ రేటే నాలుగేళ్ల కనిష్టం. అంతకుముందు ఏడాది ఇది 8.50 శాతంగా ఉంది. నాలుగేళ్ల కిందట ఇంతకంటే ఎక్కువ ఇచ్చింది. ఈసారి దానిని మరింత కిందకు తీసుకొచ్చే యోచనలో ఉంది.

97601975

”కొవిడ్-19 ప్రభావం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో పీఎఫ్ అకౌంట్ నుంచి నగదు ఉపసంహరణ కూడా తగ్గిపోయింది. దీంతో EPFO ఇన్వెస్ట్‌మెంట్లు కూడా పెరిగాయి. ఇక ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌మెంట్లపై కూడా గతేడాది కంటే ఈసారి మంచి రిటర్న్స్ వస్తాయని తెలుస్తోంది. అందుకే ఇప్పుడు పీఎఫ్ వడ్డీ రేటును 8.10 శాతంగా ఉంచడం లేదా.. 8 శాతానికి కుదించడం జరగొచ్చు.” అని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

97694685

ప్రస్తుతం పీఎఫ్ వడ్డీ రేటు కూడా ఇతర పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF) కంటే చాలా ఎక్కువగా ఉందని, రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి రాజకీయ ఉద్రిక్తతలు తలెత్తకుండా ఉండేందుకు 8 శాతంగా ఉంచేందుకే మొగ్గుచూపొచ్చని మరొక అధికారి చెప్పుకొచ్చారు. ఇక ఇదే సమయంలో గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పీఎఫ్ వడ్డీ రేటు కూడా అకౌంట్లలోకి రిఫ్లెక్ట్ అయ్యేందుకు సమయం పడుతుందని, త్వరలో అకౌంట్లలో జమ అవుతుందని స్పష్టం చేసింది ఈపీఎఫ్ఓ.

ఇక పీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్‌ను పలు విధాలుగా తెలుసుకోవచ్చు. అక్కడే మనం వడ్డీ జమ అయిందో లేదో కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది.

EPFOHO UAN ENG or Hindi .. అంటే ఇక్కడ UAN నంబర్ లేదా లాంగ్వేజ్ తెలుగు అయితే TEL అని 7738299899 నంబర్‌కు SMS చేయడం ద్వారా తెలుసుకోవచ్చు.

011-22901406 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా పీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.

Umang Appలో ఎంప్లాయీ సెంట్రిక్ సర్వీసెస్‌లో Passbook అన్నదానిపై క్లిక్ చేసి.. UAN, OTP ఎంటర్ చేసి పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.

EPFO పోర్టల్ epfindia.gov.in వెబ్‌సైట్‌లోనూ సర్వీసెస్ ట్యాబ్‌లో ఎంప్లాయీస్ అన్నదానిపై క్లిక్ చేసి సర్వీసెస్ సెక్షన్‌లో మెంబర్ పాస్‌బుక్‌ను చూడొచ్చు.

97647511

Read Latest Business News and Telugu News

20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *