Gold Rates Today: మల్టీ కమొడిటీ ఎక్స్చేంజిలో (MCX) బంగారం ధర శుక్రవారం సెషన్‌లో భారీగా తగ్గింది. 10 గ్రాములకు రూ.56,602 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. ఇది ఆల్ టైమ్ గరిష్టాల నుంచి చూస్తే రూ.2200 తక్కువ కావడం విశేషం. ఇటీవలి కాలంలో తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్న వేళ.. ప్రస్తుతం గోల్డ్ కొనేందుకు ఇది మంచి సమయమేనా? నిపుణులు ఏమంటున్నారు? ఇక అంతర్జాతీయ మార్కెట్లోనూ స్పాట్ గోల్డ్ రేటు భారీగా పడిపోయింది. ప్రస్తుతం ఔన్సుకు 1855 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గత సెషన్ క్లోజ్ ప్రైస్ కంటే 0.27 శాతం మేర పతనమైంది. బంగారం ధర తగ్గేందుకు కారణాలను వివరించారు కమొడిటీ మార్కెట్ నిపుణులు.
రికార్డు ధరల నుంచి బంగారం ధర వెనక్కి వచ్చేందుకు యూఎస్ డాలర్, బాండ్ ఈల్డ్స్ పుంజుకోవడమే కారణమని చెబుతున్నారు మార్కెట్ నిపుణులు. అయితే బంగారం ఇంకా బుల్లిష్ జోన్‌లోనే ఉందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కొనుగోళ్లు చేయొచ్చని అంటున్నారు. బంగారం ధరలో ఈ పతనం.. గోల్డ్ ఇన్వెస్టర్లకు మంచి అవకాశం అని చెప్పారు IIFL సెక్యూరిటీస్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అనుజ్ గుప్తా.
97789536
దేశీయ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరల్లో పతనం కొనసాగుతోంది. ఇటీవల రెండేళ్ల గరిష్టా్న్ని మించి ట్రేడయిన సంగతి తెలిసిందే. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు పెంచినప్పటినుంచి.. డాలర్, బాండ్ ఈల్డ్స్‌కు గిరాకీ పెరిగి.. బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధర తగ్గిపోతోంది. దీంతో.. రేట్లు దిగి వస్తు్న్నాయి. అయితే.. అమెరికాలో ద్రవ్యోల్బణం పరిస్థితులు మరింత క్లిష్టంగా మారుతున్న నేపథ్యంలో.. మరోసారి యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను పెంచొచ్చని తెలుస్తోంది. దీంతో బంగారం, వెండి ధరలు మరింత తగ్గే సూచనలే కనిపిస్తున్నాయి.
97786809
Read Latest
Business News and Telugu News