TS EAMCET 2023 :
తెలంగాణలో ఈ ఏడాది ఎంసెట్ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు గుడ్‌న్యూస్. రాష్ట్రంలో మే 7 నుంచి జరిగే ఎంసెట్‌లో ఇంటర్ ఫస్టియర్‌లో 70 శాతం సిలబస్ నుంచే ప్రశ్నలు ఇస్తారు. సెకండియర్‌లో మాత్రం 100 శాతం సిలబస్ నుంచి ప్రశ్నలుంటాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆర్.లింబాద్రి వెల్లడించారు. ఎంసెట్ రాయబోయే విద్యార్థులు 2021-22లో ఫస్టియర్ పరీక్షలు రాశారని.. కరోనా కారణంగా అప్పుడు 70 శాతం సిలబస్‌తోనే వార్షిక పరీక్షలు నిర్వహించినందున ఎంసెట్‌లో ఫస్టియర్‌లో అదే సిలబస్ ఉంటుందని తెలిపారు.
TS EAMCET 2023 : ఎంసెట్ 2023 పరీక్షల షెడ్యూల్ ఇదే:
తెలంగాణలో వివిధ ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం 2023-24 విద్యా సంవత్సరానికి గాను నిర్వహించే ఎంసెట్‌తో పాటు మరికొన్ని ప్రవేశ పరీక్షల తేదీలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇటీవల విడుదల చేశారు. ఇందులో భాగంగా మొత్తం 7 ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. జేఎన్టీయూ నిర్వహించనున్న తెలంగాణ ఎంసెట్ 2023 పరీక్షలను ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగం పరీక్ష మే 7 నుంచి 11 వరకు నిర్వహించనున్నారు.
ఎంసెట్ అగ్రీ అండ్ ఫార్మా విభాగం మే 12 నుంచి 14 వరకు నిర్వహిస్తారు. వీటితో పాటు టీఎస్ ఎడ్‌సెట్ మే 18, టీఎస్ ఈసీఈటీ మే 20వ తేదీ, టీఎస్ లాసెట్ మే 25వ తేదీన, టీఎస్ ఐసెట్ మే 26,27 తేదీల్లో, టీఎస్ పీజీఈసెట్‌ను మే 29, 30, 31, జూన్ 1 నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
97802192