449 ప్లాట్ల వేలానికి సర్కార్ నోటిఫికేషన్

449 ప్లాట్ల వేలానికి సర్కార్ నోటిఫికేషన్ హైదరాబాద్ : ఓపెన్ ప్లాట్ల అమ్మకానికి రాష్ట్ర సర్కార్ మరో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజగిరి జిల్లాల్లో 449 ప్లాట్ల వేలానికి సంబంధించి వివరాలు వెల్లడించింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలో 73 ప్లాట్లు (267 – 497 గజాలు), మేడిపల్లిలో 50 ప్లాట్లు(300 గజాలు), రంగారెడ్డి జిల్లాలోని మన్నెగూడలో 102 ప్లాట్లు(235 –300 గజాలు), మునగనూరులో 133 ప్లాట్లు(157 – 453), కవాడిపల్లిలో 91 ప్లాట్లు(182 – 418 గజాలు) అందుబాటులో ఉన్నట్లు చెప్పింది. కవాడిపల్లి ప్లాట్లకు డిపాజిట్ ఫీజు రూ.50 వేలుగా, మిగతా చోట్ల రూ.లక్షగా నిర్ణయించారు.

బాచుపల్లి ప్లాట్లకు మార్చి 2, 3 తేదీల్లో మేడిపల్లి మార్చి 6న వేలం నిర్వహించనున్నారు. ఇక మన్నెగూడ ప్లాట్లకు మార్చి 9, 10, మునగనూరుకు మార్చి 13,14,15, కవాడిపల్లి ప్లాట్లకు 16,17 తేదీల్లో ఈ వేలం ఉంటుందని అధికారులు ప్రకటించారు.  ఆసక్తికలిగిన వారు రూ.1,180 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.

©️ VIL Media Pvt Ltd.

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *