తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. నిన్న, ఇవాళ రాష్ట్రంలోని ప్రధాన సమస్యలు, ప్రజల ఇబ్బందులను ప్రతిపక్షాలు లేవనెత్తాయి. ఇక నేటి అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ పోడుభూములు, అటవీ అధికారులపై చేసిన దాడులపై స్పందించారు. పోడు భూములపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. పోడు భూములు గిరిజనుల హక్కు కాదు. అడవులను కాపాడాలా వద్దా అన్నారు. అడవులను నరికేయం అని చెబితేనే పోడు భూములు ఇస్తాం. వారు భూమిని ఆక్రమిస్తే, అడ్డుకోబోయిన ఫారెస్ట్ అధికారిని పట్టపగలే చంపడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.
ఇక భూమి లేని గిరిజన బిడ్డలకు త్వరలో గిరిజన బంధు కూడా ప్రారంభిస్తాం. 11 లక్షల ఎకరాల పోడు భూములు ఇవ్వడమే కాదు. కరెంట్ కనెక్షన్, రైతుబంధు కూడా ఇస్తామని కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. మేము ఓట్ల సమయంలో ఒక మాట. ఓట్ల తరువాత ఒక మాట మాట్లాడం. మాకు ఆ అవసరం లేదన్నారు. ఫిబ్రవరి నెలాఖరులో పోడు భూముల పంపిణీ జరుపుతామని కేసీఆర్ అన్నారు. అయితే ఈ భూములు తీసుకునే వారు అడవులకు కాపలాదారులుగా ఉండాలి. ఒకవేళ వాళ్లు అడవులను కొట్టివేస్తే పట్టాలు కూడా క్యాన్సల్ చేస్తామన్నారు.