horoscope today 10 February 2023 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, రాశి ఫలాల గురించి తెలుసుకోవడం వల్ల భవిష్యత్తు గురించి ఒక అంచనాకు రావొచ్చు. ఈ నేపథ్యంలో ఈరోజున 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలొచ్చాయంటే…
horoscope today 10 February 2023 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున చంద్రుడు కన్యరాశిలో పగలు, రాత్రి సంచారం చేయనున్నాడు. ఇదే రోజున గజకేసరి యోగం ఏర్పడటం వల్ల వృషభరాశి, కన్య రాశుల వారికి ధన లాభం కలిగే అవకాశం ఉంది. హస్తా నక్షత్రం ప్రభావం వల్ల మరికొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా ఈరోజున ఏ రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది. 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం…
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
ఈ రాశి వారికి ఈరోజు అనేక రంగాల్లో విజయం లభిస్తుంది. ఈరోజు మీ శ్రమకు తగిన ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లేందుకు ప్రణాళిక రూపొందిస్తారు. ఈరోజు మీ ఖర్చులు పెరుగుతాయి. అయితే నిరాశ చెందాల్సిన అవసరం లేదు. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ కెరీర్లో పురోగతి లభిస్తుంది. వ్యాపారులు మంచి విజయాలు సాధిస్తారు. మీ వ్యక్తిగత జీవితంలో కొంత ఇబ్బందిగా ఉంటుంది.
ఈరోజు మీకు 69 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం :
ఈరోజు బ్రాహ్మాణులకు దానం చేయాలి.
Sun Transit in Aquarius 2023 కుంభంలో సూర్యుడి సంచారం.. ఈ 5 రాశులపై ప్రతికూల ప్రభావం…!
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
ఈ రాశి వారికి ఈరోజు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక పరంగా ఈరోజు బలంగా ఉంటుంది. మీకు ఇంటి పనుల్లో మంచి విజయాలు లభిస్తాయి. మీ పెండింగ్ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. దీని వల్ల మీకు సంతోషం కలుగుతుంది. ఇంటి పెద్దల ఆశీస్సులతో కొత్త పనులు ప్రారంభమవుతాయి. పెట్టుబడుల విషయంలో రిస్క్ తీసుకోకుండా ఉండాలి.
ఈరోజు మీకు 71 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం
: ఈరోజు ఈశ్వరుడికి చందనం సమర్పించాలి.
మిధున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులు మంచి లాభాలను పొందే అవకాశం ఉంది. అయితే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శత్రువుల నుంచి కొంత ఇబ్బంది ఉండొచ్చు. మీ తల్లి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. ఉద్యోగులు కార్యాలయంలో కొన్ని విషయాల గురించి ఆందోళన చెందుతారు. మీ వ్యక్తిగత జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి సహాయంతో మీరు ఆస్తిలో పెట్టుబడి పెట్టొచ్చు.
ఈరోజు మీకు 90 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం
: ఈరోజు శని దేవుడిని సందర్శించి ఆవాల నూనె సమర్పించాలి.
కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
ఈ రాశి వారికి ఈరోజు చాలా కష్టంగా ఉంటుంది. ఈరోజు మీ ఖర్చులు పెరుగుతాయి. మీ మానసిక ఒత్తిడి పెరుగుతుంది. మీ పెండింగ్ పనులు పూర్తి కానున్నాయి. మీ శక్తి పెరుగుతుంది. కోర్టుకు సంబంధించిన విషయాల్లో విజయం సాధిస్తారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మంచి ప్రయోజనం పొందుతారు. మీ మనసులో ఆనందంగా ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయంలో మంచి ప్రయోజనాలు పొందుతారు.
ఈరోజు మీకు 93 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం :
ఈరోజు రాత్రి నల్లకుక్కకు చివరి రొట్టె తినిపించాలి.
సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
ఈ రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీరు క్లిష్ట పరిస్థితుల నుంచి సులభంగా బయటపడతారు. మీ ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంది. కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. ఉద్యోగులకు ఈరోజు కార్యాలయంలో సానుకూల ఫలితాలొస్తాయి. ప్రేమికులకు ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. వ్యాపారులకు మంచి లాభాలొస్తాయి.
ఈరోజు మీకు 81 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం
: ఈరోజు వినాయకుడికి దుర్వా సమర్పించాలి.
కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలొస్తాయి. మీ ఆరోగ్యం క్షీణించొచ్చు. వ్యాపారులకు ఈరోజు మెరుగైన ఫలితాలొస్తాయి. ఈరోజు వాహనాన్ని జాగ్రత్తగా నడపాలి. మీరు సుదూర ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఈరోజు తీర్థయాత్రలకు కూడా ప్లాన్ చేయొచ్చు. మీ ఆదాయం పెరగడం వల్ల మనసులో సంతోషంగా ఉంటుంది. మరోవైపు మీ ప్రేమ జీవితంలో కొంత ఆందోళన ఉంటుంది.
ఈరోజు మీకు 63 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం
: ఈరోజు ఈశ్వరుడికి తెల్ల చందనం సమర్పించాలి.
Mahashivratri 2023 మహాశివరాత్రి వేళ శివయ్యను ఈ పువ్వులతో పూజిస్తే.. విశేష ఫలితాలొస్తాయని తెలుసా…
తుల రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
ఈ రాశి వారిలో ఈరోజు రాజకీయాలకు సంబంధించిన వారికి సానుకూల ఫలితాలొస్తాయి. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. స్నేహితులు, బంధువుల సహాయంతో మీ పెండింగ్ పనులు పూర్తవుతాయి. మీకు రావాల్సిన బకాయిలు తిరిగి పొందుతారు. ఈరోజు సాయంత్రం కొన్ని శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. మీరు ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.
ఈరోజు మీకు 84 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం :
ఈరోజు శివునికి రాగి పాత్రలో నీళ్లు సమర్పించాలి.
వృశ్చిక రాశి వారి ఫలితాలు (Scorpio Horoscope Today)
ఈ రాశి వారికి ఈరోజు చాలా బిజీగా ఉంటుంది. ఈ కారణంగా మీరు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. మీ తెలివితేటలతో ఈరోజు డబ్బు సంపాదించడంలో విజయం సాధిస్తారు. మరోవైపు సన్నిహితులతో అనవసర వివాదాలు ఏర్పడొచ్చు. మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ కొన్ని ముఖ్యమైన పనులు ఆగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఓపికగా ఉండాలి. ఇలాంటి సమయంలో స్నేహితుల మద్దతు లభిస్తుంది.
ఈరోజు మీకు 66 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం :
ఈరోజు విష్ణుమూర్తికి లడ్డూలను సమర్పించాలి.
ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ఈ రాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ఎవరితోనూ వాదనలు పెట్టుకోవద్దు. చంద్రుడు ఏడో స్థానంలో ఉండటం వల్ల వ్యాపారులకు లాభలొచ్చే అవకాశం ఉంది. మీకు అత్తమామల వైపు నుంచి కొంత ప్రయోజనకరంగా ఉంటుంది. మీ మనసులో ఆనందంగా ఉంటుంది. మరోవైపు మీ ప్రేమ జీవితంలో కొంత ఆందోళన ఉంటుంది.
ఈరోజు మీకు 70 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం :
ఈరోజు శ్రీ మహా విష్ణువును పూజించాలి.
మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
ఈ రాశి వారికి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ప్రభావం పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ కు సంబంధించిన విషయాల్లో మీరు ఊహించిన దాని కంటే మెరుగైన లాభాలను పొందొచ్చు. ఉద్యోగులకు ఆఫీసులో సీనియర్ల సహకారం లభిస్తుంది. దీంతో మీకు మంచి ఫలితాలొస్తాయి. వ్యాపారులు ఈరోజు కొందరు కొత్త వ్యక్తులను కలుసుకోవడం వల్ల సానుకూల ఫలితాలు రావొచ్చు.
ఈరోజు మీకు 61 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం :
ఈరోజు శివ చాలీసా పఠించాలి.
కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
ఈ రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీ మనసులో ఆనందంగా ఉంటుంది. మీ ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ కారణంగా మీరు సంతోషంగా ఉంటారు. మీకు ఆత్మీయుల మద్దతు లభిస్తుంది. ఈరోజు మీరు ప్రత్యర్థులను ఓడిస్తారు. వ్యాపారులకు విపరీతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయాన్ని పూర్తిగా వినియోగించుకునేందుకు ప్రయత్నించాలి. మీ వైవాహిక జీవితంలోనూ ఒత్తిడి తొలగిపోతుంది.
ఈరోజు మీకు 82 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం :
ఈరోజు శ్రీ హరి ఆలయంలో పసుపు గుడ్డలో పప్పు, బెల్లం సమర్పించాలి.
మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
ఈ రాశి వారికి ఈరోజు అదృష్టం కారణంగా బకాయిలన్నీ తిరిగి పొందుతారు. మీ పాత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మీరు కొన్ని ప్రత్యేక పనుల్లో విజయం సాధిస్తారు. మరోవైపు మీ ప్రేమ వ్యవహారాల్లో కొన్ని వివాదాలు ఉండొచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు కుటుంబ సభ్యుల మద్దతు వల్ల మీకు ప్రశాంతంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి సహాయంతో ఏదైనా కొత్త పనిలో విజయం సాధించగలరు.
ఈరోజు మీకు 91 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం :
ఈరోజు పేదలకు బట్టలు, అన్నదానం చేయాలి.
గమనిక :
ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.
Read
Latest Astrology News
and