Hyderabad: హౌదరాబాద్‌లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. అత్యధికంగా ఎక్కడంటే ?

ఈ సారి వేసవి భాగ్యనగరంలో ముందుగానే మొదలయ్యింది. గత రెండేళ్లుగా ఎండలు కాస్త తగ్గాయి. అయితే ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఈసారి వేసవిలో ఎండలు మండిపోయే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే వేసవి ప్రారంభం అవుతుందనే సంకేతాలు వచ్చాయి. వచ్చిన సమాచారం ప్రకారం.. సిటీలో వేడి పెరిగింది. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇవాళ అంటే గురువారం నాడు టెంపరేచర్లు అప్పుడే 33.9 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నాయి.

నగరంలో బోరబండలో అత్యధికంగా 34.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఉప్పల్, కాప్రా, కుతుబుల్లాపూర్, సెరిలింగంపల్లి, ఖైరతాబాద్, షేక్‌పేట్, ఆసిఫ్‌నగర్, బహదూర్‌పురా మరియు సైదాబాద్‌తో సహా నగరంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 32 డిగ్రీల మార్కుకు పెరగడంతో వేడిగాలులు కూడా నమోదయ్యాయి.

IMDH (భారత వాతావరణ విభాగం – హైదరాబాద్) రాబోయే నాలుగు రోజులలో వాతావరణం మరింత వేడిగా మారుతుందని పేర్కొంది. అయితే, రాత్రి సమయంలో ఉష్ణోగ్రత చాలా ప్రాంతాల్లో 14 డిగ్రీల సెల్సియస్ మరియు 16 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని తెలిపింది.  తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) నివేదిక ప్రకారం వేసవిలో గరిష్ట ఉష్ణోగ్రతలు రోజువారీ వ్యత్యాసాలు పగటి ఉష్ణోగ్రత 11.30 నుండి 3.30 గంటల వరకు క్రమంగా పెరుగుతాయని మరియు సాయంత్రం 4.30 తర్వాత, ఉష్ణోగ్రత అకస్మాత్తుగా 6 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతాయని పేర్కొంది. సాయంత్రం 4.30 నుంచి 6.30 గంటల వరకు రెండు గంటల్లో 8 డిగ్రీల సెల్సియస్‌ ఉంటుందని తెలిపింది.

రానున్న రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరిగిందే అవకాశం ఉందని, వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. విపరీతమైన వేడి తరంగాలు, బలహీనమైన రుతుపవనాలతో సంబంధం ఉన్న ఎల్ నినో ఈ ఏడాది ఏర్పడే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గత తొమ్మిదేళ్లలో, వార్షిక గరిష్ట ఉష్ణోగ్రతలు 2016లో అత్యధికంగా, 2021లో అత్యల్పంగా నమోదయ్యాయి. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ నివేదిక ప్రకారం, ప్రస్తుతం లా నినో పరిస్థితుల కారణంగా గత మూడేళ్లలో ఉష్ణోగ్రతలు కొద్దిగా తగ్గాయి. ఎల్ నినో ప్రభావం వాతావరణంపై ప్రభావం చూపుతుంది. ఇది భారతదేశంలో కరువు లేదా బలహీన రుతుపవనాలతో సంబంధం కలిగి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *