యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) CSE పరీక్ష 2022 ఇంటర్వ్యూ షెడ్యూల్‌ను విడుదల చేసింది. పర్సనాలిటీ టెస్ట్‌కు ఎంపికైన అభ్యర్థులు UPSC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా పర్సనాలిటీ టెస్ట్ షెడ్యూల్‌ను తనిఖీ చేయవచ్చు. దీని కోసం అభ్యర్థులు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్ సైట్ ను upsc.gov.in సందర్శించాలి. ఉదయం సెషన్, మధ్యాహ్నం సెషన్‌గా రెండు సెషన్లలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఉదయం సెషన్‌కు రిపోర్టింగ్ సమయం ఉదయం 9 గంటలు మరియు మధ్యాహ్నం సెషన్‌కు రిపోర్టింగ్ సమయం మధ్యాహ్నం 1 గంటలకు ఉంటుంది. అయితే ఈ సమయం కంటే ముందే సెంటర్ కు చేరుకోవాలని అధికారులు అభ్యర్థులకు సూచించారు.
ఈ తేదీ నుంచి ఇంటర్వ్యూ..
వెబ్‌సైట్‌లో ఇచ్చిన నోటీసు ప్రకారం.. UPSC CSE యొక్క పర్సనాలిటీ టెస్ట్ మార్చి 13 నుండి నిర్వహించబడుతుంది. మార్చి 13 నుండి ప్రారంభమయ్యే ఈ ఇంటర్వ్యూలు ఏప్రిల్ 21, 2023 వరకు కొనసాగుతాయి. ఈ సందర్భంగా మొత్తం 918 మంది ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. రోల్ నంబర్, తేదీ మరియు ఇంటర్వ్యూ సెషన్ యొక్క పూర్తి వివరాలను కమిషన్ తన వెబ్‌సైట్‌లో విడుదల చేసింది.
డౌన్‌లోడ్ ఇలా..
పర్సనాలిటీ టెస్ట్ కోసం షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డ్‌లను UPSC వెబ్‌సైట్ నుండి గడువులోగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రిపోర్టింగ్ సమయం నుండి ఇంటర్వ్యూ తేదీ వరకు తేదీల్లో ఎలాంటి మార్పు ఉండదని నోటీస్ లో పేర్కొన్నారు. మార్పు కొరకు ఎవరినీ సంప్రదించవద్దని స్పష్టం చేశారు.
అభ్యర్థులకు ఇంటర్వ్యూ కోసం ప్రయాణ ఖర్చు ఇవ్వబడుతుంది. ఈ మొత్తం స్లీపర్ క్లాస్ లేదా సెకండ్ క్లాస్ రైలు ప్రయాణానికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఇతర మార్గాల ద్వారా ప్రయాణించడానికి డబ్బు కమీషన్ ద్వారా ఇవ్వబడదని నోటీస్ లో పేర్కొన్నారు.