సీఎం కేసీఆర్‌తో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ అయ్యారు. అసెంబ్లీ హాల్‌లో ఆయన కేసీఆర్‌తో సమావేశమయ్యారు. మెట్రో లైన్ ప్రాజెక్ట్ పొడిగింపుపై సీఎం కేసీఆర్‌కు జగ్గారెడ్డి వినతిపత్రం అందించారు. నియోజకవర్గ అభివృద్ధి పనులపైనా సీఎం కేసీఆర్‌తో జగ్గారెడ్డి చర్చించారు. సీఎం ఛాంబర్‌లో కేసీఆర్‌ను జగ్గారెడ్డి మరోసారి కలవనున్నారు. అభివృద్ధి కార్యక్రమాలపైనే సీఎంను కలిశానని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. తాను సీఎం కేసీఆర్‌ను చాటుగా కలవలేదని వెల్లడించారు. కాంగ్రెస్ ఎంపీలు ప్రధానిని కలిస్తే తప్పులేనప్పుడు ఎమ్మెల్యేగా సీఎంను కలిస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు.
Jagga Reddy: సీఎం కేసీఆర్‌తో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ.. అందుకేనని వివరణ
