Mahashivratri 2023 మహాశివరాత్రి వేళ ఈ శివాలయాల్లో జరిగే వేడుకలను ప్రత్యక్షంగా చూస్తే.. కోరికలన్నీ నెరవేరుతాయట…!

Mahashivratri 2023 హిందూ పంచాంగం ప్రకారం, ఫిబ్రవరి 18వ తేదీన మహాశివరాత్రి పండుగ వచ్చింది. ఈ పవిత్రమైన రోజున ప్రపంచవ్యాప్తంగా శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

Mahashivratri 2023 మరికొద్ది రోజుల్లో మహాశివరాత్రి పండుగ రానుంది. హిందు మతంలో ఈ పండుగకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రతి సంవత్సరం మాఘ మాసంలో చతుర్దశి, అమావాస్య తిథుల మధ్య మహాశివరాత్రి పండుగను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున పరమేశ్వరుడికి అంకితమివ్వబడింది. ఈ పర్వదినాన దేశవ్యాప్తంగా ఉండే శివాలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటుంది. హిందూ పురాణాల ప్రకారం, మహా శివరాత్రి రోజునే శివపార్వతుల కళ్యాణం జరిగింది. లింగోద్భవం జరిగిందని చాలా మంది నమ్ముతారు. ఈ సమయంలో శైవ క్షేత్రాలతో పాటు, పరమేశ్వరుని ఆలయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. మహాశివరాత్రి రోజున శివస్వాములతో పాటు సాధారణ భక్తులు కూడా శివాలయాలను సందర్శిస్తారు. ఇదిలా ఉండగా.. మన దేశంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రముఖ శైవ క్షేత్రాల్లో ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తారు. మన తెలుగు రాష్ట్రాల్లో శ్రీశైలం మల్లన్న బ్రహ్మోత్సవాలు, బెజవాడలో ప్రత్యేక కార్యక్రమాలు, కోటప్ప కొండలో త్రికోటేశ్వర ఆలయంలో, అమరావతిలో అమరేశ్వర ఆలయంలో, వేములవాడ రాజన్న ఆలయంలో ఘనంగా వేడుకలను నిర్వహిస్తారు. వీటితో పాటు దేశంలో పలు శివాలయాల్లో మహాశివరాత్రి వేడుకలను విభిన్నంగా నిర్వహిస్తారు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. మహాశివరాత్రి వేళ భారతదేవంలోని ప్రముఖ శివాలయాలను సందర్శించాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఆ ప్రముఖ దేవాలయాలెక్కడున్నాయి.. వాటి ప్రత్యేకతలేంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం…

శ్రీశైలం మల్లికార్జున స్వామి..

భారతదేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో శ్రీశైలం ఒకటి. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని శ్రీశైల క్షేత్రంలో ఫిబ్రవరి 11 నుంచి 21వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ పవిత్ర సమయంలో మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక దేవిని పురవీధుల్లో, ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వాహన సేవల ద్వారా పూజలు చేస్తారు. మహాశివరాత్రి వేళ ఈ వేడుకలను తిలకించేందుకు ఆంధ్రా, తెలంగాణతో పాటు కర్నాటక, మహారాష్ట్ర నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. శ్రీశైలం చేరుకోవడానికి ఆంధ్రా, తెలంగాణ నుంచి రోడ్డు మార్గం అందుబాటులో ఉంది.

Mahashivratri 2023 మహాశివరాత్రి రోజున ఈ పరిహారాలతో శని, నాగదోషాలతో పాటు ఎన్నో సమస్యల నుంచి విముక్తి పొందొచ్చు…!

pc:

fbsriasalam devasthanamofficial

ఉమానంద ఆలయం, అస్సాం..

అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో ఉన్న ఉమానంద ఆలయంలో మహా శివరాత్రి వేడుకలను అత్యంత ఘనంగా జరుపుకుంటారు. బ్రహ్మపుత్ర నదిలోని పీకాక్ ద్వీపంలో ఈ ఆలయం నిర్మించబడింది. ఇక్కడ శివరాత్రి వేడుకలను చూసేందుకు లక్షలాది మంది భక్తులు గౌహతి నగరానికి తరలి వెళ్తారు.

PC :

Wikipedia

భావనాథ్ గుజరాత్..

గుజరాత్ రాష్ట్రంలోని జునాగఢ్ గిర్ జతీయ ఉద్యానవనానికి మాత్రమే ప్రసిద్ధి చెందిందనే చాలా మందికి తెలుసు. అయితే గిర్ అడవిలో నివసించే సాధువులు, భావనాథ్ తలేటికి కూడా నిలయంగా ఉంది. మహాశివరాత్రి సమయంలో జునాగఢ్ శివరాత్రి సంబరాలను చూసేందుకు దేశ నలమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఇక్కడ వేడుకలు మహాశివరాత్రికి 5 రోజుల ముందే ప్రారంభమవుతాయి. పండుగ రోజున ముగుస్తాయి.

భూతనాథ్ ఆలయం, హిమాచల్ ప్రదేశ్..

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఒక చిన్న పట్నం అయిన మండిలో మహాశివరాత్రి వేడుకలు జరుపుకోవడానికి ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటిగా చెబుతారు. ఇక్కడి భూత్ నాథ్ ఆలయంలో శివరాత్రి వేడుకలను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. జానపథ కథల ప్రకారం, క్రీ.శ.5వ శతాబ్దంలో మండి రాజకుటుంబం వారం రోజుల పాటు మహాశివరాత్రి వేడుకలను నిర్వహిస్తారు.

మహాకాళేశ్వర ఆలయం, ఉజ్జయిని..

ప్రపంచంలోని ప్రసిద్ధి గాంచిన జ్యోతిర్లింగాలలో మధ్యప్రదేశ్ లోని మహాకాళేశ్వర్ ఆలయం ఒకటి. ఇక్కడ మహా శివరాత్రి వేడుకలను షిప్రా నది ఒడ్డున జరుపుకుంటారు. పురాణాల ప్రకారం, దూషణ అనే రాక్షసుడు అవంతిలో నివసించే ప్రజలను హింసించేవాడు. అప్పుడు పరమేశ్వరుడు భూమి నుంచి ప్రత్యక్షమై ఆ రాక్షసుడిని వధించాడు. అప్పుడు అవంతి ప్రజల కోరిక మేరకు పరమేశ్వరుడు మహాకాళేశ్వర జ్యోతిర్లింగ రూపంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు.

నీలకంఠస్వామి, హరిద్వార్..

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ ఘాట్లకు ప్రసిద్ధి. అయితే ఇక్కడ నీలకంఠ మహాదేవుని ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. మహాశివరాత్రి రోజున భోలేనాథుని దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. ఇక్కడికొచ్చే భక్తులకు రివర్ రాఫ్టింగ్ వంటి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

శ్రీ సోమనాథ జ్యోతిర్లింగ దేవాలయం, గుజరాత్..

గుజరాత్ రాష్ట్రంలోని సోమనాథ ఆలయంలో 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ రాత్రి వేళలో ఎల్ఈడీ లైట్లు, పండ్లతో ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఈ పవిత్రమైన రోజున సోమనాథేశ్వరునికి పాలు, తేనే, పంచదార, నెయ్యి, పెరుగు, నీటితో శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

PC :

Wikipedia

ఈశా యోగా కేంద్రం, కోయంబత్తూరు..

తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులోని ఈశా యోగా కేంద్రాన్ని ప్రముఖ రచయిత, ఆధ్యాత్మికవేత్త సద్గురు స్థాపించారు. సద్గురు భోలేనాథుని 112 అడుగుల ఉక్కు విగ్రహాన్ని ఇక్కడ నిర్మించారు. ప్రపంచంలోనే అత్యంత పెద్ద విగ్రహాల్లో ఇదొకటి. మహాశివరాత్రి వేళ ఇక్కడ ప్రత్యేక వేడుకలను నిర్వహిస్తారు. సంగీతం, నాట్యం, ధ్యానంతో పాటు సద్గురువుతో కలిసి రాత్రంతా భజనలు చేస్తూ జాగరణ ఉండి ఆనందిస్తారు.

వీటితో పాటు ఇంకా చాలా దేవాలయాల్లో మహాశివరాత్రి వేడుకలు జరుపుకుంటారు.

PC :

Wikipedia

Read

Latest Religion News

and

Telugu News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *