Vande Bharat ఎక్స్‌ప్రెస్ రైలుపై మళ్లీ రాళ్ల దాడి.. ఈసారి..

Vande Bharat: సికింద్రాబాద్‌- విశాఖపట్నం వందే భారత్‌ ఎక్స్‌ప్రైస్‌ రైలుపై.. మరోసారి రాళ్ల దాడి జరిగింది. మహబూబాబాద్‌ దాటిన తర్వాత.. గార్ల రైల్వే స్టేషన్ల సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరడంతో ఒక బోగి అద్దాలు ధ్వంసమయ్యాయని అధికారులు వెల్లడించారు. రైల్వే రక్షక దళం వెంటనే అప్రమత్తమై.. నిందితుడిని గుర్తించే పనిలోపడ్డారు. సికింద్రాబాద్‌ నుంచి విశాఖ వెళ్తుండగా ఈ stone pelting ఘటన జరిగింది. C-8 కోచ్‌లో సీటు నంబర్‌ 41, 42, 43 వద్ద ఉన్న అద్దం పగిలిందని అధికారులు చెప్పారు.

ఈ రాళ్ల దాడిలో.. ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. ఇప్పుడే కాదు.. గతంలోనూ వందే భారత్‌ రైలు ప్రారంభానికి ముందు ఆకతాయిలు రాళ్లు విసిరారు. విశాఖ సమీపంలో ఆ ఘటన జరిగింది. నిర్వహణ పర్యవేక్షణలో భాగంగా.. విశాఖ (Visakhapatnam) స్టేషన్‌ నుంచి కోచ్‌ కాంప్లెక్స్‌కు వెళ్తుండగా.. కంచరపాలెం వద్దకు రాగానే కొందరు ఆకతాయిలు రైలుపై రాళ్లు విసిరారు. అప్పుడు కూడా రైలు కిటికీ అద్దం ధ్వంసమైంది. ఇలా.. రాళ్ల దాడి జరగడంపై రైల్వే అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Read Latest

Andhra Pradesh News

and

Telugu News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *