‘Vedha’ Streaming on Zee 5: ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా కంటెంట్ ఉంటే ఏ భాష సినిమానైనా ఇతర భాషల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే లేనివిధంగా కన్నడ సినీ పరిశ్రమ నుంచి కేజిఎఫ్, చార్లీ 777, కాంతార వంటి సినిమాలో వచ్చి సూపర్హిట్గా నిలిచాయి. ఈ నేపథ్యంలో అక్కడి స్టార్ హీరో శివ రాజ్ కుమార్ హీరోగా నటించిన వేద సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
ఆసక్తికరంగా తెలుగులో పెద్ద ఎత్తున థియేటర్లలో ఈ సినిమాని ఫిబ్రవరి 9న విడుదల చేశారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నందమూరి బాలకృష్ణ సైతం హాజరు కావడం ఆసక్తికరంగా మారింది. అయితే ఆ సినిమాని ఫిబ్రవరి 9వ తేదీన ఆర్ కృష్ణ మండపాటి తెలుగులో రిలీజ్ చేయగా పదవ తేదీన ఈ సినిమా జీ 5 యాప్ లో తెలుగు సహా తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో శ్రీమౌతోంది. ఈ సినిమా శివ రాజ్ కుమార్ కి చాలా ప్రత్యేకమైన సినిమా అని చెబుతున్నారు.
ఎందుకంటే ఆయన కెరియర్లో ఇది 125 సినిమా అలాగే ఆయన సతీమణి గీతా శివా రాజ్ కుమార్ నేతృత్వంలో గీతా పిక్చర్స్ బ్యానర్లు రూపొందిన తొలి సినిమా కూడా కావడంతో ఈ సినిమా మీద అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ యాక్షన్ డ్రామా మూవీని ఏ.హర్ష దర్శకత్వం వహించగా కన్నడలో ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేశారు కానీ ఆసక్తికరంగా తెలుగులో రిలీజ్ అయిన ఒక్క రోజు వ్యవధిలోనే ఓటీటీలో కూడా అందుబాటులోకి రావడం గమనార్హం.
అయితే నిర్మాతలకు ఎలాంటి స్ట్రాటజీ ఉన్నదో తెలియదు కానీ ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో ప్రస్తుతం స్ట్రీమ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ జి ఫైవ్ లో తెలుగు సహా కన్నడ, తమిళ, మలయాళ, హిందీ కన్నడ భాషల్లో ప్రస్తుతానికి అందుబాటులోకి వచ్చేసింది. ఇక ఈ సినిమా చూడాలంటే జి5 సబ్స్క్రిప్షన్ తప్పనిసరి, జి5 నెలవారి ప్యాకేజీలతో పాటు మూడు నెలలు ఆరు నెలలు ఏడాది ప్యాకేజీలను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకెందుకు ఆలస్యం కొనుగోలు చేయండి సినిమా చూసేయండి.
Also Read: Amigos Movie Review: కళ్యాణ్ రామ్ అమిగోస్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
Also Read: Happy Teddy Day 2023 Wishes: టెడ్డీ డే విషెస్ ఇలా చెప్పండి.. మీ పార్టనర్స్ ఫిదా అవడం గ్యారెంటీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ – https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ – https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook