ఇంట్లో ఈ మార్పులు చేస్తే చిన్న ఇల్లు కూడా లగ్జరీగా కనిపిస్తుంది

ఇంటిని అందంగా కనిపించేలా చేయాలని అందరికీ అనిపిస్తుంది. కానీ, కొన్నిసార్లు కుదరకపోవచ్చు. అయితే, ఇంట్లో కొన్ని వస్తువులని మారిస్తే ఎలాంటి ఇంటినైనా అందంగా కనిపించేలా చేయొచ్చు.

బ్రైట్ కలర్స్, బోల్డ్ ప్రింట్స్ ఇంట్లో కనిపిస్తే ఆ ఇలు అందంగా కనిపించడమే కాకుండా ఆహ్వానించేలా కనిపిస్తుంది. వీటితో పాటు ఇంట్లో ఖాళీగా కనిపించే ప్లేసెస్‌ని ఎలా డెకరేట్ చేయాలో తెలియదు చాలా మందికి. కానీ, ఇంట్లో కొన్ని మార్పులు చేయడం వల్ల చాలా వరకూ సమస్య దూరమవుతుంది. కొన్ని వస్తువులని వాడడం వల్ల ఆ ఇంటికే కళ వస్తుంది. వీటిని ఈజీగా చేయొచ్చు. దీనికి పెద్ద ఖర్చు కూడా ఉండదు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

మెట్ల కింద ప్లేస్..

కొంత మంది ఇళ్ళలో లోపలే మెట్లు ఉంటాయి. వాటికింద ప్లేస్ చాలా వరకూ ఖాళీగా ఉండడమే కాకుండా చూడ్డానికి కాస్తా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి వారు మెట్ల కింది ప్లేస్‌లో రెండు డోర్స్ ఉన్న క్యాబినెట్ ప్లేస్‌గా మార్చుకోవచ్చు. ఇందులో మీరు టవల్స్, ఎక్కువగా ఉన్న దుప్పట్లు వంటివి పెట్టుకోవచ్చు. మీకు కాస్తా ఓపిక ఉంటే ఈ వెనుకాల ప్లేస్‌ని రకరకాల కలర్స్‌తో మంచి డిజైన్స్ కూడా వేసుకోవచ్చు.

Also Read : Hug Day 2023 : ఇష్టమైన వారిని ఎందుకు హగ్ చేసుకోవాలంటే..

బెడ్స్..

చిన్న రూమ్స్, చిన్న ఇల్లు ఉన్నవారు ఫర్నీచర్ కొనేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించాలి. ఓ వస్తువుని కొంటే అది మనకి మల్టిపర్పస్‌గా ఉపయోగపడాలి. ఈ నేపథ్యంలోనే స్టోరేజ్ బెడ్స్ అనేవి చాలా బెస్ట్. వీటిని వాడడం వల్ల చాలా స్పేస్ మిగులుతుంది. వీటి స్టోరేజ్ బాక్సుల్లో మీరు తక్కువగా అవసరం అయ్యే ఎలాంటి వస్తువులు అయినా పెట్టొచ్చు. పిల్లల గదులు, పెద్దల గదులు ఇలా ఎక్కడైనా ఎవరి రూమ్‌లో తగ్గట్లు వారికి ఇవి దొరుకుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

Also Read : Abdominal Pain : పొత్తికడుపులో నొప్పి వస్తుంటే ఈ సమస్య ఉందేమో చెక్ చేసుకోండి..

సిట్టింగ్ ఏరియాలో..

చాలా మంది కూర్చుని రెస్ట్ తీసుకోవడానికి ఓ ప్లేస్‌ని పెట్టుకుంటారు. దీనిని సిట్టింగ్ ఏరియా అంటారు. ఈ ప్లేస్‌లో చెయిర్స్, సెంట్రల్ టేబుల్ పెడుతుంటారు. ఇందులో చెయిర్స్, కాస్తా రిలాక్స్‌డ్‌గా ఉండేలా చూసుకోండి. పాదాలను పైకి పెట్టేందుకు సెంట్రల్ టేబుల్ ఉంటుంది. ఆ సెంట్రల్ టేబుల్‌ని కింద స్టోరేజ్ పెట్టుకునే విధంగా ఉండేలా డిజైన్ చేసినవి ఉంటారు.

Also Read : Periods : ఆముదంతో ఇలా చేస్తే త్వరగా పీరియడ్స్ వస్తాయి

అల్మారా..

మనలో చాలా మంది చెప్పుల్ని, షూస్‌ని ఎక్కడ పడితే అక్కడ పెడుతుంటారు. కానీ, వీటిని కూడా చక్కగా అందంగా డిజైనర్ షూ రాక్స్ ఉంటున్నాయి. వీటిని పెట్టుకోవడం వల్ల చెప్పులు, స్నీకర్స్, ఫ్లాట్స్, హీల్స్ ఏవైనా సరే అందులో పెట్టొచ్చు. ఇందులో చాలా షెల్ఫ్స్ ఉంటాయి. వాటిని బయటికి కనిపించకుండా అందంగా కనిపించేలా చేస్తాయి. వీటిని అందంగా పెయింట్ వేసి మరింత అందంగా కనిపించేలా చేయొచ్చు.

చిన్నమార్పుతోనే..

ఇలా ఇంట్లోన కొన్ని మార్పులు చేయడం వల్ల ఇంటిని అందంగా మార్చొచ్చు. ఎప్పటికీ అప్పుడు రెగ్యులర్ కలర్స్ కాకుండా.. కొత్తకొత్తవి ట్రై చేసి అందంగా కనిపించేలా చేయొచ్చు. మీకు ఏవైనా వస్తువులు చూసి చూసి బోర్ కొడితే వాటిని కొద్దిగా మార్పులు చేసి మంచి కలర్స్ వేయొచ్చు. పాత వస్తువులు తీసేసి వాటి ప్లేస్‌లో కొత్తవి పెట్టడం, అవసరం లేనివి తీసి పారేయడం వంటివి చేయొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *