ఈ సిమ్ వాడే వారికి గుడ్ న్యూస్.. కొత్తగా రూ.99 ప్లాన్, నెలంతా మాట్లాడుకోవచ్చు!

Vi 99 Plan | ప్రముఖ టెలికం కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న వొడాఫోన్ ఐడియా తాజాగా తన కస్టమర్లకు తీపికబురు అందించింది. చౌక ధర టారిఫ్ ప్లాన్ తీసుకువచ్చింది. దీంతో కస్టమర్లకు ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. వొడాఫోన్ ఐడియా కొత్తగా రూ. 99 రీచార్జ్ ప్లాన్ తీసుకువచ్చింది. ఇది చౌక ధరల టారిఫ్ అని చెప్పుకోవచ్చు. భారతీ ఎయిర్‌టెల్ (Airtel), రిలయన్స్ జియో (Jio) వంటి కంపెనీల కనీస రీచార్జ్ ధరలు దీన్ని కన్నా ఎక్కువగా ఉన్నాయి. జియో నెలవారీ కనీస రీచార్జ్ ప్లాన్ రూ. 129గా ఉంది. ఇక ఎయిర్‌టెల్ నెలవారీ కనీస రీచార్జ్ ధర రూ. 155గా కొనసాగుతోంది.

వొడాఫోన్ కొత్తగా తీసుకువచ్చిన ఈ రూ. 99 ప్లాన్ విషయానికి వస్తే.. దీని వాలిడిటీ 28 రోజులు ఉంటుంది. ఈ ప్లాన్‌లో భాగంగా కస్టమర్లకు 200 ఎంబీ డేటా వస్తుంది. టాక్ టైమ్ రూ. 99 లభిస్తుంది. అంతే ఇక ఇతర బెనిఫిట్స్ ఏవీ ఉండవు. ఫీచర్ ఫోన్ వాడే వారికి ఈ ప్లాన్ చాలా అనువుగా ఉంటుందని చెప్పుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి ఈ ప్లాన్ వల్ల బెనిఫిట్ కలుగుతుంది.

గుడ్ న్యూస్.. రూ.2,300 పతనమైన బంగారం ధర, ఆల్‌టైమ్ గరిష్టం నుంచి..

ఈ కొత్త ప్లాన్‌లో భాగంగా ఎలాంటి ఎస్ఎంఎస్ సర్వీసులు ఉండవు. అంటే మీరు ఎవ్వరికీ ఎస్ఎంఎస పంపలేరు. ఒకవేళ 1900కు ఎస్ఎంఎస్ పంపాలంటే మీ బ్యాలెన్స్ కట్ అవుతుంది. అందువల్ల ఎస్‌ఎంఎస్ సర్వీసులు అందుబాటులో లేవని చెప్పుకోవచ్చు. ఈ కాలంలో ఎస్ఎంఎస్ సర్వీసులు ఉపయోగించే వారు చాలా తక్కువనే చెప్పుకోవచ్చు. అందరూ వాట్సాప్ వాడుతూ ఉంటారు. ఇకపోతే ఈ ప్లాన్‌లో కాల్స్‌కు సెకన్‌కు 2.5 పైసలు పడుతుంది.

రూ.12 వేల డిస్కౌంట్, 0 డౌన్ పేమెంట్, 0 ప్రాసెసింగ్ ఫీజు.. ఎలక్ట్రిక్ స్కూటర్‌పై భారీ ఆఫర్లు!

అందువల్ల ఎవరైనా వొడాఫోన్ ఐడియా సిమ్ కార్డు వాడుతూ ఉంటే.. ఈ రూ. 99 ప్లాన్‌తో రీచార్జ్ చేసుకోవచ్చు. నెల రోజుల పాటు కాల్స్ చేసుకోవచ్చు. అయితే గంటల కొద్ది మాట్లాడే వారికి ఈ ప్లాన్ అనువుగా ఉండదు. ఎందుకంటే రూ. 99 టాక్ టైమ్ అయిపోతే మీరు తర్వాత ఫోన్ కాల్స్ కూడా చేసుకోలేరు. అందువల్ల మితంగా మాట్లాడే వారికి, నెట్ ఎక్కువగా ఉపయోగించని వారికి మాత్రమే ఈ ప్లాన్ అనువుగా ఉంటుందని గుర్తించుకోవాలి. లేదంటే ఇతర ప్లాన్స్‌తో రీచార్జ్ చేసుకోవచ్చు. అప్పుడు అపరిమిత కాల్స్ లభిస్తాయి. ఇంకా రోజు 1 జీబీ నుంచి డేటా పొందొచ్చు. స్మార్ట్‌ఫోన్స్ వాడే వారు ఇలాంటి ప్లాన్స్‌తో రీచార్జ్ చేసుకోవడం ఉత్తమం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *