ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రేపు మరో జాబ్ మేళా.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. ఈ నెల 11న ఉదయం 9 గంటలకు మరో జాబ్ మేళా(Job Mela) ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ (Job Registration) చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్ మేళా ద్వారా మొత్తం 13 కంపెనీల్లో 800లకు పైగా ఉద్యోగావకాశాలను కల్పించనున్నారు.

ఖాళీలు, విద్యార్హతల వివరాలు:

ముత్తూట్ గ్రూప్: ఈ సంస్థలో మరో 200 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ, పీజీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనం ఉంటుంది.

హీరో మోటో కార్పొరేషన్ లిమిటెడ్: ఈ సంస్థలో 50 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్, ఐటీఐ అర్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు.

గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్: ఈ సంస్థలో మొత్తం 100 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.11 వేల నుంచి రూ.13 వేల వరకు వేతనం ఉంటుంది.

ఐసీఐసీఐ: ఈ సంస్థలో మొత్తం 50 ఖాళీలు ఉన్నాయి. రిలేషన్ షిప్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనం ఉంటుంది.

ఇతర వివరాలు:

– అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది

– రిజిస్టర్ చేసుకున్న వారికి ఈ నెల 11న ఉదయం 9 గంటలకు SVSSC Govt.Degree College, Shar Road, Sullurupeta చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.

– అభ్యర్థులు ఇంటర్వ్యలకు హాజరయ్యే సమయంలో ఫార్మల్ డ్రస్ తో రావాల్సి ఉంటుంది.

– ఇంకా Resume&సర్టిఫికేట్లను వెంట తీసుకురావాల్సి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *