Banks | ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ తాజాగా కస్టమర్లకు తీపికబురు అందించింది. కీలక నిర్ణయం తీసుకుంది. డబ్బులు దాచుకోవాలని భావించే వారికి ఊరట కలిగే ప్రకటన చేసింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (FD) వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు వెల్లడించింది. దీంతో బ్యాంక్‌లో డబ్బులు (Money) దాచుకోవాలని భావించే వారికి గతంలో కన్నా ఎక్కువ వడ్డీ రేటు లభిస్తుందని చెప్పుకోవచ్చు. వడ్డీ రేట్ల పెంపు నిర్ణయం నేటి నుంచే అంటే ఫిబ్రవరి 11 నుంచి అమలులోకి వచ్చింది.
రూ. 2 కోట్లలోపు డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచినట్లు యాక్సిస్ బ్యాంక్ వెల్లడించింది. బ్యాంక్ ఇప్పుడు 7 రోజుల నుంచి పదేళ్ల వరకు టెన్యూర్‌లోని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 3.5 శాతం నుంచి 7 శాతం వరకు అందిస్తోంది. రెగ్యులర్ కస్టమర్లకు ఇది వర్తిస్తుంది. అదే సీనియర్ సిటిజన్స్‌కు అయితే వడ్డీ రేటు 6 శాతం నుంచి 7.75 శాతం వరకు ఉంది. రెండేళ్ల నుంచి 30 నెలల వరకు టెన్యూర్‌లోని ఎఫ్‌డీలపై గరిష్టంగా 8.01 శాతం వరకు వడ్డీ వస్తోంది. సీనియర్ సిటిజన్స్‌కు ఇది వర్తిస్తుంది. అదే సాధారణ కస్టమర్లకు అయితే 7.26 శాతం వడ్డీ వస్తుంది.
టాప్ 7 ఇ-బైక్స్ ఇవే.. ఒక్కసారి చార్జ్ చేస్తే 105 కి.మి. వెళ్లొచ్చు, ధర రూ.29 వేల నుంచి..
యాక్సిస్ బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం చూస్తే.. 7 రోజుల నుంచి 45 రోజుల ఎఫ్‌డీలపై అయితే వడ్డీ రేటు 3.5 శాతంగా ఉంది. 46 రోజుల నుంచి 60 రోజుల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 4 శాతంగా ఉంది. ఇక 61 రోజుల నుంచి మూడు నెలలు, మూడు నెలల నుంచి ఆరు నెలల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు వరుసగా 4.5 శాతంగా, 4.75 శాతంగా ఉన్నాయి. 6 నెలల నుంచి 9 నెలల ఎఫ్‌డీలపై అయితే వడ్డీ రేటు 5.75 శాతంగా ఉంది. 9 నెలల నుంచి ఏడాది ఎఫ్‌డీలపై అయితే వడ్డీ రేటు 6 శాతంగా ఉంది.
కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్.. బ్యాంక్ కీలక నిర్ణయం!
ఇక ఏడాది నుంచి ఏడాది 24 రోజుల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 6.75 శాతంగా ఉంది. అలాగే ఏడాది 25 రోజుల నుంచి 13 నెలల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 7.1 శాతంగా ఉంది. 13 నెలల నుంచి రెండేళ్ల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 6.75 శాతంగా ఉంది. రెండేళ్ల నుంచి 30 నెలల ఎఫ్‌డీలపై వడ్డీర టు 7.26 శాతంగా కొనసాగుతోంది. 30 నెలల నుంచి పదేళ్ల వరకు టెన్యూర్‌లోని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 7 శాతంగా ఉంది. ఆర్‌బీఐ రెపో రేటు పెంపు నేపథ్యంలో బ్యాంకులు కూడా ఎఫ్‌డీ రేట్లు పెంచుకుంటూ వస్తున్నాయి.