Interest Rates | ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన ఫెడరల్ బ్యాంక్ తాజాగా తన కస్టమర్లకు తీపికబురు అందించింది. ఆర్బీఐ రెపో రేటు పెంపు నేపథ్యంలో ఫెడరల్ బ్యాంక్ (Bank) కూడా సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లను సవరించింది. ఆర్బీఐ (RBI) రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచిన తరుణంలో ఫెడరల్ బ్యాంక్ కూడా బ్యాంక్ అకౌంట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేటు 0.25 శాతం మేర పైకి కదిలింది. దీంతో బ్యాంక్లో అకౌంట్ కలిగిన వారికి ఇకపై అధిక రాబడి లభిస్తుందని చెప్పుకోవచ్చు.
ఫెడరల్ బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం చూస్తే.. ఆర్బీఐ రెపో రేటు పెంపు నేపథ్యంలో సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీ రేట్లు కూడా టీ ప్లస్ 1 విధానంలో మారతాయి. డెయిలీ బ్యాలెన్స్ లెక్కింపు ప్రాతిపదికన మూడు నెలలకు ఒకసారి కస్టమర్ల అకౌంట్లలో వడ్డీ డబ్బులు క్రెడిట్ అవుతాయి. కాగా బ్యాంక్లో సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేట్లు అనేవి బ్యాంక్ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ ప్రాతిపదికన మారుతూ ఉంటాయి.
కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్.. బ్యాంక్ కీలక నిర్ణయం!
రూ. 5 లక్షలకు లోపు బ్యాలెన్స్ ఉన్న ఖాతాలపై వడ్డీ రేటు రెపో రేటు కన్నా 3.45 శాతం తక్కువగా ఉంటుంది. అలాగే రూ. 5 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు బ్యాలెన్స్ ఉన్న అకౌంట్లపై వడ్డీ రేటు రెపో రేటు కన్నా3.4 శాతం నుంచి 3.45 శాతం వరకు తక్కువగా ఉంటుంది. అలాగే రూ. 50 లక్షల నుంచి రూ. 2 కోట్ల వరకు బ్యాలెన్స్ ఉంటే.. అప్పుడు ఆ అకౌంట్లపై కూడా వడ్డీ రేటు రెపో రేటు కన్నా 2.75 శాతం నుంచి 3.45 శాతం వరకు తక్కువ వడ్డీ రేటు ఉంటుంది.
ఒక్క రూపాయి కట్టకుండానే ఫ్రీగా క్రెడిట్ కార్డు.. ఉచితంగా రూ.15 లక్షల బెనిఫిట్!
ఇంకా రూ. 2 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకు బ్యాలెన్స్ ఉన్న ఖాతాలపై వడ్డీ రేటు ఆర్బీఐ రెపో రేటు కన్నా 2.5 శాతం నుంచి 3.45 శాతం వరకు తక్కువగా ఉంటుంది. రూ. 5 కోట్ల నుంచి రూ. 50 కోట్ల వరకు బ్యాలెన్స్ ఉంటే.. అప్పుడు వడ్డీ రేటు రెపో రేటు కన్నా 1 శాతం నుంచి 3.45 శాతం వరకు తక్కువ వడ్డీ లభిస్తుంది. ఇంకా 50 కోట్ల నుంచి ఆపై బ్యాలెన్స్ ఉంటే.. అప్పుడు వడ్డీ రేటు ఆర్బీఐ రెపో రేటు కన్నా 0.5 శాతం నుంచి 3.45 శాతం వరకు వడ్డీ తక్కువగా వస్తుంది.