చరిత్ర సృష్టించిన టాటాలు.. లక్షల కోట్లతో ఏకంగా 500 విమానాలకు ఆర్డర్.. కనీవిని ఎరగని డీల్ ఇది..

Air India: టాటా గ్రూప్ ఇటీవలి కాలంలో దూకుడుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ ఇతర రంగాల్లోకి ప్రవేశిస్తోంది. ఈ గతేడాది దిగ్గజ విమానయాన సంస్థ ఎయిరిండియాను తిరిగి దక్కించుకున్న విషయం అందరికీ తెలిసే ఉంటుంది. ఇక అప్పటినుంచి దీనిని మరింత మెరుగ్గా విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. విమానయాన సర్వీసులను పెంచుకోవడంతో దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థగా అవతరించాలని చూస్తోంది. ఇదే సమయంలో ప్రయాణికులకు ఇతర సౌకర్యాలను మెరుగుపర్చుకోవాలని భావిస్తోంది.

దీంతో.. ఎప్పటినుంచో యూరోపియన్, అమెరికా విమానయాన సంస్థలు ఎయిర్‌బస్, బోయింగ్ నుంచి పెద్ద ఎత్తున విమానాలను ఆర్డర్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఇది ఫైనలైజ్ అయినట్లు దీని గురించి తెలిసిన కొందరు చెప్పారు. మొత్తంగా 500 ఎయిర్‌క్రాఫ్ట్‌లకు ఆర్డర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇది విమానయాన చరిత్రలో ఇప్పటివరకు పెద్ద డీల్ అని సమాచారం. ఈ మొత్తం 500 విమానాల్లో.. 430 నారోబాడీ, 70 వైడ్‌బాడీ ఎయిర్‌క్రాఫ్ట్‌లు. రానున్న 7-8 సంవత్సరాల్లో వీటిని ఎయిరిండియా దక్కించుకోనుంది.

దిగ్గజ యూరోపియన్ మానుఫ్యాక్చరర్ ఎయిర్‌బస్‌కు ఇందులో మెజారిటీ వాటా ఉంది. ఇది 240 A320 Neo, 40 A350 ఎయిర్‌క్రాఫ్ట్‌లను డెలివరీ చేయనుంది. ఇక అమెరికా మానుఫ్యాక్చరర్ బోయింగ్.. 190 740 మాక్స్, 20 787, 10 777x విమానాలను అందించనుంది.

15 శాతం ఉద్యోగులకు లేఆఫ్.. వాళ్ల కోసం అన్నీ వదులుకున్న సీఈఓ.. గుడ్‌బై అంటూ భావోద్వేగం!

ఈ బిగ్ ఆర్డర్‌పై వచ్చే వారంలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ఇక దీని లిస్ట్ ప్రైస్ 150 బిలియన్ డాలర్లు అంటే సుమారు భారత కరెన్సీలో రూ.12 లక్షల కోట్లకుపైనే ఉందని సమాచారం. అయితే ఇంత పెద్ద లావాదేవీలపై సుదీర్ఘ చర్చలు సాగే అవకాశముంది. ఎయిరిండియాలో ఇప్పటికే ఎయిరేషియా ఇండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విలీనం అయ్యాయి. సింగపూర్ ఎయిర్‌లైన్స్ విస్తారాను కూడా టాటా గ్రూప్ ఎయిరిండియాలో విలీనం చేస్తున్నట్లు గతంలో ప్రకటించింది. దీంతో తన విమానయాన సర్వీసుల్ని మెరుగుపర్చుకోనుంది.

97812475

ఎయిర్‌బస్‌తో డీల్ శుక్రవారమే ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఆ రోజు జరిగిన భేటీలో టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్, ఎయిర్‌బస్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ క్రిస్టియన్ స్కెరర్ పాల్గొన్నారు. ఇక బోయింగ్‌తో జనవరి 29నే డీల్ కుదిరినట్లు తెలిసింది. బాంబే హౌస్‌లోని టాటా సన్స్ హెడ్‌క్వార్టర్స్‌లో ఈ ఒప్పందం జరిగింది. అయితే గతేడాది ఎయిరిండియాను కొనుగోలు చేసేటప్పటికి అది అప్పులోనే ఉంది. ఇప్పుడు కూడా అప్పుల్లోనే ఉన్నట్లు తెలిసింది. దీంతో.. ఆ అప్పులను తీర్చేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి పెద్ద ఎత్తున స్వల్పకాలిక రుణాలు తీసుకోనున్నట్లు తెలిసింది. దీని గురించి స్పష్టమైన సమాచారం లేదు.

Read Latest

Business News and Telugu News

Also Read:

అదానీ కీలక నిర్ణయం.. హిండెన్‌బర్గ్‌ను గట్టి దెబ్బ కొట్టేలా ఈసారి పక్కా ప్లాన్‌తో.. అన్ని దారులు మూసుకుపోయేలా..!

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *