ట్విటర్ బ్లూటిక్ సేవలు ఇండియాలో మొదలు.. టిక్ కావాలంటే ఎంత ఖర్చయిద్దంటే…

Click here to see the BBC interactive

మైక్రోబ్లాగింగ్ సైటు ట్విటర్‌ను కొనుగోలు చేసిన తర్వాత, అమెరికా టెక్ వ్యాపారవేత్త ఎలన్ మస్క్ ఈ సోషల్ మీడియా బ్లూటిక్ సర్వీసుల కోసం డబ్బులు చెల్లించాలని ప్రకటించారు.

మస్క్ ఈ ప్రకటన తర్వాత, సోషల్ మీడియా ప్రపంచంలో ఆయనపై తీవ్ర విమర్శలను వచ్చాయి.

బ్లూటిక్ కోసం ఎలాంటి డబ్బులు చెల్లించమని ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా మంది సోషల్ మీడియా ప్రముఖులు అన్నారు.

కానీ పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చినప్పటికీ, ఎలన్ మస్క్ నేతృత్వంలోని ట్విటర్ తన పెయిడ్ బ్లూటిక్ సర్వీసులను తిరిగి భారత్‌లో లాంచ్ చేసింది.

ప్రపంచవ్యాప్తంగా మూడు రకాల టిక్‌లను ట్విటర్ లాంచ్ చేసింది.

దీనిలో బూడిద రంగు టిక్‌లను ప్రభుత్వ సంస్థలకు, బ్లూ టిక్‌లను వ్యక్తులకు, వ్యాపార సంస్థలకు బంగారు వర్ణపు టిక్‌లను ఆఫర్ చేస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా ఈ సేవల కోసం నెలకు 8 డాలర్లను, 11 డాలర్లను చెల్లించేలా రెండు రకాల ప్లాన్లను తీసుకొచ్చింది ట్విటర్.

ట్వీట్లను ఎడిట్ చేసుకునే సౌకర్యంతో పాటు కొన్ని ప్రత్యేక రకమైన సేవలను కూడా ట్విటర్ అందిస్తోంది.

గత డిసెంబర్‌లోనే ఈ సేవలకు సంబంధించిన సమాచారం వెలుగులోకి వచ్చింది. కానీ, ట్విటర్ వీటిని భారత్‌లో ప్రస్తుతం లాంచ్ చేసింది.

భారత్‌లో నెలకు రూ. 650 విధింపు

భారత్‌లో ట్విటర్ తన బ్లూటిక్ సేవలను తిరిగి లాంచ్ చేసింది. దీని కింద భారత్‌లో బ్లూటిక్ సేవలను వాడుకోవాలంటే ప్రతి నెలా రూ. 650 చెల్లించాలి.

అంటే, మొత్తంగా ప్రతేడాది ఈ సేవల కోసం భారతీయులు రూ. 7,800 ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంతేకాక, బ్లూటిక్ కోసం వార్షిక ప్లాన్ కూడా ఉంది. ఈ వార్షిక ప్లాన్ 12 శాతం డిస్కౌంట్‌తో రూ. 6,800కే అందుబాటులో ఉంది.

ట్విటర్ కొత్త ప్లాన్ కింద, బ్లూటిక్ వాడుకుంటోన్న వ్యక్తులు 50 శాతం తక్కువ యాడ్స్‌ను చూడొచ్చు.

దీంతో పాటు, ట్విటర్‌లో పెద్ద పెద్ద వీడియోలను వీరు అప్‌లోడ్ చేసుకోవచ్చు. ట్వీట్ చేసిన అరగంటలో ఐదు సార్లు ట్వీట్లను ఎడిట్ చేసుకునే అవకాశాన్ని కూడా ఈ యూజర్లు పొందుతారు.

అయితే, ఈ సేవలను ఫోన్లలో వాడుకోవాలంటే నెలకు రూ. 900 చెల్లించాలి.

ప్రస్తుత బ్లూటిక్ యూజర్ల పరిస్థితేంటి?

ట్విటర్ ఈ స్కీమ్ నుంచి ప్రయోజనం పొందాలంటే ముందస్తుగా డబ్బులు చెల్లించాలని న్యూస్ ఏజెన్సీ పీటీఐ నివేదించింది.

ఇది ప్రీ పెయిడ్ ప్లాన్. అంటే ప్రజలు తొలుత డబ్బులు చెల్లించి, ఆ తర్వాత బ్లూటిక్ సేవలను వాడుకోవాలని ట్విటర్ చెప్పింది.

దీంతో పాటు ఈ ప్లాన్‌లో ఎలాంటి మనీ బ్యాక్ సౌకర్యం లేదు.

కాల వ్యవధి పూర్తయిన తర్వాతనే ఈ ప్లాన్ సబ్‌స్క్రిప్షన్‌ను ట్విటర్ రెన్యూవల్ చేస్తుంది.

ట్విటర్ యూజర్ల నుంచి మిశ్రమ స్పందన

ట్విటర్ ఈ ప్రకటనపై భారతీయ ట్విటర్ యూజర్ల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.

”నేను ఇప్పటికే బ్లూటిక్ యూజర్‌ని. ఒకవేళ నేను దానికి దరఖాస్తు చేసుకుంటే, నేను నా వెరిఫైడ్ బ్యాడ్జ్ కోల్పోతాను. ఇప్పటికే సబ్‌స్క్రయిబ్ అయిన దానికి నేనెలా సబ్‌స్క్రయిబ్ తీసుకోవాలి? పైగా ఇది కూడా పరిమిత కాల వ్యవధి ఆఫర్. ఎలన్ మస్క్ ఏం చేయాలనుకుంటున్నారు, సోదరుడా, మాకు వివరంగా చెప్పగలరా?” అని మ్యూజిక్ కంపోజర్, మ్యూజిషియన్ అమాల్ మాలిక్ అన్నారు.

”డబ్బులు చెల్లించడం ద్వారా బ్లూటిక్‌ను పొందితే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఎందుకంటే నా లాంటి జర్నలిస్టులకు నెలకు రూ.900 అనేది చాలా పెద్ద మొత్తం” అని జర్నలిస్టు ప్రభాకర్ కుమార్ మిశ్రా అన్నారు.

ఇవి కూడా చదవండి:

  • తుర్కియే భూకంపం: 15 ఇళ్లలో కేవలం ముగ్గురు మాత్రమే బతికారు.. అంతా అపార్ట్‌మెంట్ కింద సమాధయ్యారు
  • అకస్మాత్తుగా కుప్పకూలటం, ఐసీయూలో చేరటం పెరుగుతోంది, ఎందుకిలా జరుగుతోంది?
  • భూకంపాల నుంచి హైద‌రాబాద్ ఎంత వరకూ సుర‌క్షితం?
  • రక్తహీనత: మన శరీరంలో రక్తం ఎందుకు తగ్గిపోతుంది, మళ్లీ పెరగాలంటే ఏం చేయాలి?
  • తుర్కియే, సిరియా భూకంపం: శిథిలాలలో దొరికిన చిన్నారిని దత్తత తీసుకునేందుకు ముందుకొస్తున్నవారు ఏం చెబుతున్నారు?

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *